ఆంధ్రప్రదేశ్‌

సాగర్‌కు తగ్గని వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, సెప్టెంబర్ 11: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఎగువ నుంచి సాగర్ జలాశయానికి 2,70,434 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో రూపంలో చేరుతుండగా వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. మూడు రోజుల నుండి సాగర్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 590 అడుగుల గరిష్ట నీటిమట్టంతో మొత్తం 312 టీఎంసీల సామర్థ్యం కలిగిన సాగర్ జలాశయంలో బుధవారం రాత్రికి 589.70 అడుగుల నీటిమట్టంతో 311.1486 టీఎంసీల నీరు చేరింది. సాగర్ రిజర్వాయర్ నుంచి 3,81,708 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో రూపంలో దిగువన కృష్ణానదిలోకి విడుదలవుతోంది. డ్యాం 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
చిత్రం...సాగర్ నుంచి 22 క్రస్ట్ గేట్లద్వారా దిగువకు విడుదలవుతున్న వరద నీరు