ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రైతులతో గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులతో కలిసి బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాటుతూ రాజధానిని తరలిస్తున్నామంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసి నెల రోజులు దాటుతున్నా సీఎం జగన్ నేటి వరకు నోరుమెదపక పోవటం వల్ల ఆ ప్రాంత రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెంతున్నారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ప్రకటన కోసం రైతాంగం ఎదురుచూస్తున్నదన్నారు.
చిత్రం...రాజధాని రైతులతో కలిసి గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు