ఆంధ్రప్రదేశ్‌

హైడ్రామా నడుమ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు బుధవారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని చింతమనేని నివాసం వద్దే ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. అప్పటి నుండి ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. సుమారు 14 పోలీసు బృందాలను చింతమనేని కోసం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ బుధవారం లొంగిపోతారని సమాచారం బయటకు రావడంతో దుగ్గిరాలలోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు, మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ముందుగా పోలీసులు చింతమనేని ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపరచిత మహిళ చింతమనేని ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేస్తూ హల్‌చల్ సృష్టించింది. ఈ దశలో ఆమె ఇంటిపైనుండి దూకడానికి ప్రయత్నించడంతో చింతమనేని అనుచరులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో తీవ్ర ఉద్వేగానికి లోనైన చింతమనేని సతీమణి రాధారాణి స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చింతమనేని అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు, వారికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ దశలో చింతమనేని ప్రభాకర్ తన వాహనంలో అక్కడకు చేరుకున్నారు. ఆయనను గమనించిన పోలీసులు తక్షణం అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. చింతమనేని తమ జీపు ఎక్కాలని పోలీసు అధికారులు కోరారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో బలవంతంగా జీపు ఎక్కించారు. అనంతరం సాయంత్రం ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకు వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడంతో 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం చింతమనేనిని ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు.
చిత్రం...చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు