ఆంధ్రప్రదేశ్‌

ప్రతి చర్యలో, ప్రతి అక్షరంలో మానవత్వం పరిమళించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: ప్రతి చర్యలో, ప్రతి అక్షరంలో మానవత్వం కనిపించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వినతుపై అధికారులు ఇచ్చిన సమాధానాలపై త్వరలో వర్కుషాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయం నుంచి స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనలో భాగంగా సమస్యలు పరిష్కరించిన వారికి ర్యాండమ్‌గా ఫోన్ చేసి అభిప్రాయాలను స్వీకరించామన్నారు. వీరిలో 59 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మరో 41 శాతం మంది ఆ సమస్యను మరింత మెరుగ్గా పరిష్కరించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. జిల్లాల నుంచి కొంతమంది ఎంపిక చేసిన అధికారులను పిలిపిస్తున్నామని, వినతులపై అధికారులు ఇచ్చిన సమాధానాలు వారికే చూపిస్తామన్నారు. ఏ తరహా సమాధానాలు ఇచ్చారో చూపించి, వర్కుషాపు నిర్వహిస్తామన్నారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లను పిలిపించి ఈ ప్రక్రియ చేపడతామన్నారు. ప్రతి చర్యలో మానవత్వం లేకపోతే వ్యవస్థ ఎందుకు నడుస్తుందో అర్థం కాని పరిస్థితి వస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలతో కలెక్టర్లు మాట్లాడాలని సూచించారు. వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలతో సిబ్బంది సక్రమంగా ప్రవర్తించడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి కేసులు 5 శాతం వరకూ ఉన్నాయన్నారు. దీనిని సీరియస్‌గా తీసుకుంటామని అధికారులకు చెప్పాలన్నారు. వాళ్లు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చామన్నారు. మనం సేవలకునే కాని పాలకులం కాదని స్పష్టం చేశారు. పని భారం లేదా ఇతర కారణాల వల్ల ఇలాంటివి తలెత్తవచ్చని, ఒకసారి పరిశీలన చేసుకోవాలన్నారు. స్పందన స్ఫూర్తి తగ్గకుండా చూడాలన్నారు. అలసత్వం వద్దని, యంత్రాంగాన్ని చురుగ్గా పని చేయించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలు అద్భుతంగా నిర్వహించారంటూ అభనందించారు. వర్షాల కారణంగా జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని, ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమంపైనా దృష్టిపెట్టాలన్నారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి జిల్లాలో 2 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. లక్షల మంది జీవితాలను మార్చే అవకాశం తనకు, అధికారులకు వచ్చిందన్నారు. దీనిపై దృష్టి పెట్టాలన్నారు. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలు ప్రారంభం అవుతాయని, డిసెంబర్ 1 నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డు ఇవ్వాలన్నారు.