ఆంధ్రప్రదేశ్‌

వంద రోజుల పాలనలో కక్షసాధింపు మినహా ఒరిగిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: వైఎస్ జగన్ వంద రోజుల పాలనలో ప్రత్యర్థులపై కక్ష సాధింపు మినహా అభివృద్ధిపై దృష్టి సారించలేదని, ఆయన పాలనలో ఈ రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ వై సుజనా చౌదరి ఎద్దేవా చేశారు. బుధవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జీవనాడిగా 70 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం.. అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే పోలవరం టెండరింగ్ సమయంలో అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయితే కుడికాలువ ద్వారా 80 టీఎంసీల నీళ్లు కృష్ణానదికి వస్తాయని అన్నారు. అలాగే ఎడమ కాలువ ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు నీళ్లు వెళ్తాయని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమ ఐదేళ్ల పాలనలో పోలవరంపై సమయం వృథా చేసిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల చాలా విద్యుత్ ఖర్చవుతుందన్నారు. ఎవరైనా అవినీతి చేస్తే వ్యక్తిగతంగా శిక్షించవచ్చుకాని అన్ని ప్రాజెక్టులను రద్దు చేయడం మంచిది కాదన్నారు. కేంద్రం వారిస్తున్నా రీ టెండరింగ్‌కు వెళుతున్నారని అన్నారు. రీ టెండరింగ్ వల్ల రూ. 500 కోట్లు మిగిలిస్తామంటున్నారు.. కనీసం ఐదు రూపాయలు కూడా తగ్గించలేరని సుజనా చౌదరి స్పష్టం చేశారు. పోలవరం కాఫర్ డ్యాంను పూర్తి చేసి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు. సీఎం జగన్ మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు.
చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి