ఆంధ్రప్రదేశ్‌

కనీసం 3 వారాలైనా అసెంబ్లీ నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఆంధ్రాకు ఇచ్చిన హామీలు, పోలవరం ప్రాజెక్టు అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలను ముక్తసరిగా ఐదు రోజులు జరిపించి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదన్నారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం మూడు నుంచి నాలుగు వారాలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చి తుంగలో తొక్కిందని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. అలాగే రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్ వేగంగా పనులు చేపట్టడంలేదన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై చర్చించాలంటే ఐదు రోజుల సమయం సరిపోదన్నారు. ఈ సమావేశాల్లో విభజన సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం ,కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.