ఆంధ్రప్రదేశ్‌

విమర్శలకు తావు లేకుండా ఇసుక సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: ఇసుక విషయంలో చాలామంది ప్రభుత్వంపై రాళ్లేసే ప్రయత్నాలు చేస్తున్నారని, అవినీతిని అడ్డుకోవటంతో సహించలేని వారే బురద జల్లుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విమర్శలు లేకుండా ఇసుక రవాణాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక నిల్వ కేంద్రాలను పెంచాలని, వరద తగ్గుముఖం పట్టిన వెంటనే రీచ్‌ల నుంచి వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు తరలించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రీచ్‌లలో అందుబాటులో ఉన్న ఇసుక, రవాణాలో ప్రతిబంధకాలు, కొరత తదితర అంశాలపై సచివాలయంలో బుధవారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక తవ్వకాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. దీంతో రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అవరోధాలు ఏర్పడుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కేవలం 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నారని తెలిపారు. నదీతీరంలో తవ్విన ఇసుక వరదలకు కొట్టుకుపోయిదని, లంక భూములు కూడా నీట మునిగాయన్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం 23వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొదటి మూడు రోజుల్లో రోజుకు 10 నుంచి 12వేల మెట్రిక్ టన్నుల ఇసుక డిమాండ్ ఉందని, సిమెంట్ కొనుగోళ్ల ఆధారంగా ఇసుక డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. రవాణా విషయంలో ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కాగా దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇసుక మాఫియాకు తావులేకుండా అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాలని సూచించారు. ఏ స్థాయిలోనూ అవినీతి జరక్కుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి నిఘా పెంచాలన్నారు. వరదల కారణంగా ఇప్పుడున్న సమయానికి అనువైన పద్ధతులను గుర్తించి సజావుగా వినియోగించుకోవాలన్నారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా నిర్మాణదారులు పనులు చేపడతారని తెలిపారు. ఎప్పటి నుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందనే సమాచారాన్ని వివరించాలన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కెమెరాల ఫుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని కోరారు. కొరతను అధిగమించేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టాలని ముందస్తు ప్రణాళికతో స్టాక్ యార్డుల వద్ద తగిన నిల్వలు ఏర్పాటు చేసుకుని ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ఇసుక విక్రయాలు సాగించాలని స్పష్టం చేశారు.