ఆంధ్రప్రదేశ్‌

దళితులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 12: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ సీపీ విధ్వంసాలు, అరాచకాలను ఎండగట్టేందుకు చేపట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకు దళితులను దూషించారంటూ టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కెఎస్ జవహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులను అడ్డంపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తూ చట్టాలను వైసీపీ నేతలు నీరుగారుస్తున్నారన్నారు. గురువారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నన్నపనేని రాజకుమారి దూషించారని చెప్తున్న మహిళా ఎస్‌ఐ బాడీ కెమెరాలో ఉన్న వీడియో ఫుటేజీని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులను టీడీపీకి దూరం చేయాలని వైసీపీ ఆది నుండి కుట్ర పన్నుతూనే ఉందని, వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దళితులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసింది చంద్రబాబేనన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలోనూ వైసీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఉండవల్లి శ్రీదేవి, నన్నపనేని రాజకుమారి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. వెంటనే తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకుంటే న్యాయ పోరాటం చేస్తామని జవహర్ స్పష్టంచేశారు. వంద రోజుల పాలనలో విఫలమైన జగన్ హింసా రాజకీయాలు, విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, 500 మందికి పైగా దాడులకు గురిచేశారని ఆరోపించారు. జగన్ తన పాలనా వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ఇటువంటి కుట్రలు, దాడులకు పాల్పడుతున్నారని జవహర్ దుయ్యబట్టారు.