ఆంధ్రప్రదేశ్‌

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మృత్యు ఘంటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం: భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మృత్యుఘంటికలు మోగుతున్నాయని, ఉన్నతమైన ఆశయాలతో నిర్మించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ఎటువంటి శక్తులనైనా ఎదుర్కొనేలా సభాపతుల వ్యవస్థ బలంగా ఉండాలని శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసన సభాపతుల సమావేశంలో రాజ్యాంగంలోని పదవ షెడ్యుల్, ఫిరాయింపుదారులపై చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సభాపతుల వ్యవస్థపై తన అభిప్రాయాన్ని చెప్పినట్లు ఆయన తెలియజేసారు. సింహాచలంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీరకరించరాదన్న అంశంపై తన అభిప్రాయాలను సభాపతిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వెల్లడించినట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సదస్సులు నిర్వహించాలని ఆయన తెలియజేసారు. శాసనసభ సమావేశాలకు ముందు రెండు రోజులు పునఃశ్చరణ తరగతులు నిర్వహించి శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశామన్నారు. మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ పర్నీచర్ వివాదానికి సంబంధించి ఆయన స్పందించారు. ఆ విషయమై తాను ఏ మాత్రం వ్యాఖ్యానం చేసినా ఇప్పటికే దిగజారిపోయిన స్పీకర్ వ్యవస్థను మరింత దిగజార్చినట్లవుతుందన్నారు. రాజధాని మార్పంటూ రాజకీయ రచ్చ చేయాల్సిన అవసరం లేదని, మంత్రి బొత్స సత్యనారాయణ నిజమే చెప్పారని స్పీకర్ ఒక ప్రశ్నకు సమాధానంగా సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చెప్పిన అంశానే్న మంత్రి బొత్స వెల్లడించారన్న విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. శివరామకృష్ణ ఇచ్చిన నివేదికను అనుసరించి ఉంటే రాజధాని కష్టాలు వచ్చేవికాదన్న అభిప్రాయాన్ని మాత్రమే మంత్రి వెల్లడించారని స్పీకర్ అన్నారు. తప్పోఒప్పో గత ప్రభుత్వం నిర్మాణాలు చేసిందని దానికి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. దేవాలయ భూములను గృహ నిర్మాణ పథకాలకు కేటాయించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ స్పందించారు. దేవుడి భూములతో పాటు ప్రభుత్వం, బంజరు భూములు అన్యాక్రాంతమై ఉన్నాయని అటువంటి స్థలాలను పేదలకు ఇవ్వడాన్ని మహత్కార్యంగా భావిస్తున్నానంటూ ఆయన సమర్థించారు. ఈ అంశం పై న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుందని స్పీకర్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేసారు. అక్రమనిర్మాణాల పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. భూములను కబ్జా చేసి ఆక్రమణలు చేస్తే ముఖ్యమంత్రైనా, సామాన్యుడైనా ఒకటేనని చెప్పడం కోసమే ప్రజావేదిక కూల్చారన్నారు. మాజీ ముఖ్యమంత్రి నివాసముంటున్న భవనంతో పాటు మిగిలిన అక్రమ నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చారన్నారు. మీడియా వెర్షన్లు, స్టాండర్డ్స్ అన్నీ తనకు తెలుసని మీరు రాయడానికి అభ్యంతరమైతే తన అభిప్రాయంగా ప్రజలకు చెప్పడంటూ స్పీకర్ విలేఖరులకు సెటైర్లు వేసారు.

చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం