ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలానికి తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, సెప్టెంబర్ 12: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. దీంతో జలాశయం నాలుగు గేట్లు గురువారం మూసివేశారు. సాయంత్రం 5 గంటల సమయానికి జూరాల, తుంగభద్ర నదుల ద్వారా 2,44,330 క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో డ్యామ్ నీటిమట్టం 884.400 అడుగులకు చేరుకుంది. జలాశయం బ్యాక్ వాటర్ ద్వారా పోతిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్‌కు 28,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీరు పూర్తిస్థాయిలో ఉండడంతో రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కుడి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 29,920 క్యూసెక్కులు, ఎడమ భూగర్భ జలకేంద్రంలో ఉత్పత్తి అనంతరం 38,140 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం రెండు క్రస్టుగేట్లను 10 అడుగులమేర ఎత్తి 55,600 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 1,56,591 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రస్తుతం జలాశయంలో 212.4385 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
చిత్రం...ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు