ఆంధ్రప్రదేశ్‌

గిట్టుబాటు కల్పనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 14: రైతులకు గిట్టుబాటు ధర కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మిషన్‌పై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అగ్రి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌పై ఆరా తీశారు. పంటల వారీగా ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎలా వస్తుందని ప్రశ్నించారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌కు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలన్నారు. ఇప్పుడున్న యంత్రాంగం పనితీరును పరిశీలించాలని సూచించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల నుంచి వచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకునేందుకు మరో యంత్రాంగం అవసరమన్నారు. పంటల ధరలును స్థిరీకరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌కు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇందులో అత్యుత్తమ నిపుణులను నియమించాలని ఆదేశించారు. వ్యవసాయ మిషన్ తదుపరి సమావేశంలో రానున్న పంటల దిగుబడులు, వాటికి లభించే మద్దతు ధరల అంచనాలు, మార్కెట్‌లో పరిస్థితులు నివేదించాలని నిర్దేశించారు. మినుములు, పెసలు, సెనగలు, టమోటాలకు సరైన ధరలు రావడంలేదని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం, రైతుల వద్ద నిల్వలు ఉన్నాయని, దీంతోపాటు దిగుమతి విధానాలు సరళతరం చేయడం కూడా ధరల తగ్గుదలకు కారణాలని వివరించారు. వచ్చే రబీ సీజనలో పప్పుదినుసులకు తక్కువ ధరలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టమోటా ధరల్లో హెచ్చుతగ్గులున్నాయని చెప్పారు. ఉల్లి ధరలు వినియోగదారుల మార్కెట్లో కొద్దిగా పెరిగాయన్నారు. ఈ పంటల కొనుగోళ్లకు
సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్దతు ధరలు దొరక్క, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయక గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గతంలో వ్యాపారులు, రాజకీయ నాయకులు రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. కొన్ని జిల్లాల్లో అక్రమాలు భారీగా జరిగాయని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు రైతులు కనీస మద్దతుధర కల్పించటానికి నిధుల సహకారం లేదని, పంటలకు ధర పడిపోయిన తరువాత ఆ నిధుల విడుదలలో మితిమీరిన జాప్యం జరిగేదని వివరించారు. పంట చేతికి వచ్చేసరికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. అక్టోబర్ 15 నాటికి మినుములు, పెసలు, సెనగలు తదితర పంటల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన విధానాలపై దృష్టి సారించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఫలానా పంటలు వేశామంటూ రైతులు సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చూస్తామని అధికారులు చెప్పారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. దీని ద్వారా రైతుకు మద్దతుధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే వీలుంటుందన్నారు. ఈ డేటా ఆధారంగా పంటకు కచ్చితంగా మద్దతు ధర ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. రబీ పంట నుంచి ఈ పద్ధతిని అనుసరిస్తామన్నారు. ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవటంతో పాటు కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకున్న వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించే విధానాలతో రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వర్షపాతం వివరాలు, వివిధ జిల్లాల్లో పంటల సాగు పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరవు జిల్లాల్లో పరిస్థితిని సీఎంకు అధికారులు నివేదించారు. వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రణాళికలను ఆలోచించాలని సూచించారు. గత ప్రభుత్వం ఎగవేసిన రూ. 1830 కోట్లను ఈ నెలాఖరులోగా రైతులకు పంపిణీ చేయాలన్నారు. వచ్చేనెల రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీల ద్వారా రైతులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. కరవు కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులు ఉపశమనం పొందుతారని తెలిపారు. తృణ ధాన్యాల సాగుపై దృష్టి సారించాలన్నారు. వర్షపాతం లోటు ఉన్న అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తృణధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయటం కీలకమన్నారు. ఈ పంటలకు మద్దతుధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. టమోటా ధరల తగ్గుదలపై సమావేశంలో చర్చించారు. కర్ణాటక, మహారాష్టల్రో దిగుమతులు అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ధరలు తగ్గకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర మార్కెట్లకు ఎగుమతిచేయటం ద్వారా కొంతవరకు ధరలు నిలబెట్టవచ్చని అధికారులు సూచించారు. ఈ విషయంలో జాప్యం చేయకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే రవాణా ఖర్చులు సబ్సిడీగా అందించాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతున్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పశువుల కోసం వినియోగిస్తున్న ఔషధాల్లో ప్రమాణాలు, నాణ్యతా లోపంపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎండిపోతున్న మామిడి, చినీ తదితర పంటలను కాపాడేందుకు నీటి సరఫరా కోసం పెడింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. వాతావరణ మార్పులు, రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సాయినాథ్ సూచించారు. సగటు వర్షపాతం ఉన్నప్పటికీ కరవు ఎందుకు వస్తుందనే పరిస్థితులపై ఆధ్యయనం చేయాలన్నారు. రెండు రోజుల్లో భారీగా వర్షం, ఆ తరువాత మూడు నెలలు చినుకుపడని పరిస్థితులు ఉన్నాయని వీటివల్ల వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రభావాన్ని సమగ్రంగా ఆధ్యయనం చేయాలన్నారు. గడచిన 5-10 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన పద్ధతులపై కూడా సమీక్ష అవసరమన్నారు. గత పదేళ్లలో వివిధ రంగాల పనితీరుపై శే్వతపత్రాలు రూపొందించాలని ఆదేశించారు.

చిత్రం..ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి