ఆంధ్రప్రదేశ్‌

నీ విజయం అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : జ్యోతి సురేఖ అతిచిన్న వయస్సులోనే విలువిద్య క్రీడలో అనితర సాధ్యమైన విజయాలను అందుకుని ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు గౌరవాన్ని తీసుకువచ్చారంటూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతించారు. సురేఖ సాధించిన విజయాలు చిన్నవి కావని... దేశం మొత్తం గర్వించదగినవన్నారు. విలు విద్య ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నాలుగేళ్ల, 11 మాసాల వయస్సులోనే కృష్ణానదిలో ఐదు కిలో మీటర్ల దూరం ఈతకొట్టిన సురేఖ అతి పిన్న వయస్సులనే స్విమ్మర్‌గా ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నదన్నారు. అత్యంత ధైర్య సాహసాలతో కూడుకున్న ఈ రికార్డును సాధించిన జ్యోతి సురేఖ అభినందనీయురాలన్నారు. నెదర్లాండ్‌లో జరిగిన 50వ ప్రపంచ విలు విద్య ఛాంపియన్‌షిప్- 2019లో కాంస్య పతకాన్ని సాధించడం పట్ల కూడా అభినందించారు. భవిష్యత్‌లో ఇలాంటి మరెన్నో విజయాలను అందుకుని భారత దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
చిత్రం..జ్యోతిసురేఖను సత్కరిస్తున్న గవర్నర్ హరిచందన్