ఆంధ్రప్రదేశ్‌

ఛీకొట్టే పరిస్థితి తెచ్చుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి తన అవలంబిస్తున్న మూర్ఖవిధానాల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేని పరిస్థితి నెలకొందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ముందుచూపు లేని విధానాలు, కక్షసాధింపు చర్యలతో దేశమంతా ఛీ కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకున్నారని విమర్శించారు. శనివారం టీడీపీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో తాజా పరిస్థితులపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ దృష్ట్యా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎవరూ బతకడానికి వీల్లేదు అన్నట్లుగా వైసీపీ నేతల తీరు
ఉందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయడంతో జాతీయ మీడియా సైతం జగన్ విధానాలను తప్పుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల్లో సైతం అమరావతిపై విస్తృతంగా చర్చ జరుగుతోందని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు అభద్రతాభావాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మనకంటూ ఓ గుర్తింపు ఉన్న పెద్ద నగరం లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఏమిటన్న ఆవేదన తల్లిదండ్రుల్లో ఉందన్నారు. ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వారిలో కనపడుతోందన్నారు. జగన్ మూర్ఖత్వంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ఆదాయ మార్గాలను అనే్వషించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తుండటంతో పెట్టుబడులు, పారిశ్రామిక వేత్తలు వెనుకంజ వేస్తున్నారని, ఈ అంశంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని జగన్ తన తెలివితక్కువ నిర్ణయాలతో కుంటుపడేలా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కక్షపూరిత దాడులు పెచ్చుమీరుతున్నాయని, కుటుంబ సభ్యులు కలిసి ఉండాలన్నా వైసీపీ నేతల అనుమతి తీసుకోవాలన్న రీతిలో ప్రభుత్వ పాలన ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వీటిని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.