ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో డెంగ్యూ, విషజ్వరాలతో ప్రజానీకం మృత్యువాత పడుతున్నారని, ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధి కోన తాతారావు డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ రాష్ట్రంలో జ్వరాలతో 125 మంది మరణించినట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోందన్నారు. అపెడమిక్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదని, నిర్లక్ష్యం ఫలితంగానే ప్రస్తుతం సామాన్య ప్రజానీకం జ్వరాలతో మృత్యువాత పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, సహా విష జ్వరాలకు సంబంధించి 7410 కేసులు నమోదయ్యాయన్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 1478కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. డెంగ్యూ కేసలు రాష్ట్ర వ్యాప్తంగా 3,205 కేసులు, విషజ్వరాలకు సంబందించి 17,800 కేసులు నమోదయ్యాయన్నారు. అయితే, రాష్ట్రంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకానికి సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.