ఆంధ్రప్రదేశ్‌

అవినీతిపై ఇది ప్రజాయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: అవినీతిపై ప్రజాయుధంగా లోకాయుక్త వ్యవస్థ తోడ్పడుతుందని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ పీ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని ఒక హోటల్ కాన్ఫరెన్స్ హాలులో లక్ష్మణరెడ్డికి ఆత్మీయ సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ పీ లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ అవినీతి నిర్మూలనకు, పారదర్శక పాలనకు ప్రజలను జాగృతులను చేయాలన్నారు. అన్నా హజారే కృషితో కేంద్రంలో లోక్‌పాల్ వ్యవస్థ అవతరించడం మంచి పరిణామం అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బలమైన లోకాయుక్త వ్యవస్థలు ఏర్పడాలన్నారు. వ్యవస్థ అంతా అవినీతిమయంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు అవినీతికి వ్యితిరేకంగా బలమైన ఉద్యమాలు చేయాలన్నారు. విద్యాధికులలోనే అవినీతి ఎక్కువగా ఉందన్నారు. సార్వభౌమాధికారులుగా ఉండవలసిన ప్రజలు నిస్సహాయులుగా మారుతున్నారన్నారు. తప్పు రుజువైతే ఏ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధినైనా, అధికారులనైనా ఉపేక్షించేది లేదన్నారు. తమతమ ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతిపై రుజువులతో లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని, సత్వర న్యాయం చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తప్పుడు ఫిర్యాదు చేస్తే సంవత్సరం పాటు జైలు శిక్షతో కూడిన శిక్ష ఉంటుందని హెచ్చరించారు.

*చిత్రం... లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ లక్ష్మణరెడ్డిని సత్కరిస్తున్న జనచైతన్య వేదిక ప్రతినిధులు