ఆంధ్రప్రదేశ్‌

కొంపముంచుతున్న వేలంవెర్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 15: ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇక పాపికొండలను చూడలేమా..’ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదోరకంగా ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా ‘పాపికొండల యాత్ర పూర్తిచేసుకోవాలి’ ఇది విహారయాత్రలపై మక్కువ ఉండే అందరి లక్ష్యంగా మారింది. ఫలితంగా పాపికొండలు యాత్రకు నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపువుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో పర్యాటకులు రాజమహేంద్రవరం చేరుకుని పర్యాటక బోట్లలో యాత్రకు ఉత్సుకత చూపుతుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా పాపికొండలు యాత్ర జోరుగా సాగుతుండగా, ఇటీవలి కాలంలో మరింత
ఎక్కువయ్యింది. నదిలో నీటి ప్రవాహం ఉంటే ముంపు ప్రమాదం, నీరు లేని పక్షంలో ఇసుక దిబ్బలకు తగిలి బోట్లు నది మధ్యలో నిలిచిపోతుండటం, అదీ కాదంటే వంటా వార్పు జరిగే బోట్లలో అగ్నిప్రమాదాలు.. ఇలా ఇన్ని రకాల ప్రమాదాలు పొంచివున్నా లెక్కచేయని పర్యాటకుల వేలంవెర్రి వారి ప్రాణాలను ‘నదిలో దీపం’లా మారుస్తోంది.
రక్షణ చర్యలు నామమాత్రమే...
నదిలో ప్రయాణిస్తూ పాపికొండల ప్రకృతి సౌందర్యాన్ని తిలకించాలనే పర్యాటకుల వేలంవెర్రిని క్యాష్ చేసుకునే పనిలో ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక బోట్ల యజమాన్యాలు నిమగ్నమవుతున్నాయి. సరైన రక్షణ చర్యలు లేకుండానే బోట్లు నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి రాజమహేంద్రవరం చేరుకునే పర్యాటకులను రోడ్డు మార్గంలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడి నుండి బోట్లపై యాత్రకు తీసుకెళుతున్నారు. ఇలా తీసుకెళ్లే పర్యాటుకులకు కచ్చితంగా లైఫ్ జాకెట్లు ధరింపజేయాల్సివుంది. అయితే ఇవి బోట్లలో నామమాత్రంగానే ఉంటున్నాయి. ఒకవేళ ఉన్నా పర్యాటకులంతా ధరించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలనే నిబంధనను పట్టించుకోవడంలేదు. అలాగే పర్యాటక బోట్లలో నిబంధనలన్నీ పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు సైతం అంతంతమాత్రంగానే వ్యవహరిస్తున్నారనే అరోపణలున్నాయి. దీనితో బోటు నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాల నుండి వస్తున్న పర్యాటకుల్లో ఎక్కువమంది రాజమహేంద్రవరం నుండి యాత్ర ప్రారంభించి, అదే రోజు సాయంత్రానికి తిరిగి రాజమహేంద్రవరం చేరుకుని, తిరిగివెళ్లడానికి ఏర్పాట్లుచేసుకుంటున్నారు. ఈ హడావిడి యాత్రలో ఎంతో విలువైన తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామనే విషయాన్ని పర్యాటకులు మరిచిపోతుండటమే విషాదం.