ఆంధ్రప్రదేశ్‌

‘పవర్’్ఫల్‌గా విద్యుత్ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 15: విద్యుత్ రంగాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక పురోగమన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ రంగాన్ని మరింత సమర్థంగా, ఆర్థిక సుస్థిరత సాధించేలా చేయటంతో పాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలపాలని, ఇతరులు మనల్ని ఆదర్శంగా తీసుకునేలా చూడాలని ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య జయంతి సందర్భంగా ఆదివారం ప్రభుత్వం కోరినట్లు శ్రీకాంత్ చెప్పారు.
భారతరత్న విశే్వశ్వరయ్య జయంతి సందర్భంగా ఆదివారం వివిధ విభాగాల ఇంజనీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంతర్గత సామర్థ్యం పెంపు, విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీల్లో అధునాతన సాంకేతికతను ప్రవేశపెట్టటం, వౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాల అనుసరణ, వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయటం, వారికి మరింత చేరువయ్యేందుకు ఇంధన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గాడిన పెడతామని స్పష్టం చేశారు. అతి తక్కువ ధరల్లో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి విద్యుత్ రంగమే కీలకమన్నారు. అన్ని రంగాలకు, ప్రత్యేకించి పరిశ్రమలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుత్‌ను అందించడం ద్వారా ఉపాధి కల్పన సాధ్యమవుతుందని, తద్వారా జీఎస్డీపీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల నుంచి పూర్తిస్థాయిలో సహకారం లభిస్తోందని, నిర్ణీత సమయంలోగా బిల్లులు చెల్లిస్తున్నారని తెలిపారు. అయితే అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడమే విద్యుత్ రంగానికి సమస్యగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దీనివల్ల అసాధారణ సంక్షోభం ఏర్పడిందన్నారు. విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుండి ఒడ్డున పడేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తూ సవాళ్లను అధిగమించేందుకు ఇంజనీర్లు యథావిధిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మోక్షగుండం ఆదర్శం
ఇంజనీర్లంతా భారతరత్న మోక్షగుండం సేవలను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీకాంత్ సూచించారు. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే ఆయన దేశంలో సాగునీటి వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నేటితరం ఇంజనీర్లు పనిచేయాలన్నారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించి వినియోగదారుల సమస్యలు తీర్చేందుకు ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు 1.7కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని, వారికి సమస్యలు ఎదురైనప్పుడు తక్షణం స్పందించాలని సూచించారు. ఫలితంగా విద్యుత్ రంగంపై సద్భావన ఏర్పడుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటికీ ప్రభుత్వం సమాన ప్రాతినిధ్యం కల్పిస్తోందని తెలిపారు. వౌలిక సదుపాయాలను మెరుగుపరచటంతో పాటు వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణం స్పందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూ. 10,698 కోట్ల పెట్టుబడితో 2023-24కల్లా వివిధ సామర్థ్యాలు కలిగిన 155 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకూ అత్యంత ప్రాధాన్యమిస్తోందని శ్రీకాంత్ వివరించారు. అందుబాటు ధరల్లో విద్యుత్ అందించటంలో భాగంగా ప్రభుత్వం థర్మల్ విద్యుదుత్పత్తిని కూడా పెంచాలని యోచిస్తోందని ఏపీ జెన్‌కో ఎండీ బీ శ్రీ్ధర్ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో పీక్ డిమాండ్ 10170 మెగావాట్లకు చేరిందని 2016 మార్చిలో ఇది 7391 మెగావాట్లు మాత్రమేనన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ వినియోగం కూడా భారీగా పెరగనుందని, దీనివల్ల విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుందన్నారు. అందుకు అనుగుణంగా ఉత్పాదన పెంచేందుకు జెన్‌కో సిద్ధమవుతోందని వెల్లడించారు. శ్రీశైలంలో అంచనాలకు మించి జల విద్యుదుత్పాదన జరుగుతోందని, దీనివల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. మరికొన్ని రోజులు జల విద్యుదుత్పాదన చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డిస్కం సీఎండీ హర్‌నాథ్‌రావు, ఏపీఎస్‌ఈబీఏ అధ్యక్షుడు ఎం వేదవ్యాసరావు, సెక్రటరీ జనరల్ జి రామకృష్ణుడు, ఉమెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ ప్రత్యూష, ఏపీ జెన్‌కో డైరెక్టర్లు బి వెంకటేశులు రెడ్డి, బీఏ మోహన్‌రావు, చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం నెల్లూరు ఎన్టీటీపీఎస్‌లో ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో మోక్షగుండం విగ్రహాన్ని ఆవిష్కరించారు.