ఆంధ్రప్రదేశ్‌

పవన్ ఇంటికి అప్పట్లో ఇసుక ఫ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 15: ఇసుకను ప్యాకేజీల్లో అమ్మరని ఎవరైనా పవన్‌కళ్యాణ్‌కు చెప్పండంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. అమరావతిలో పవన్‌కళ్యాణ్ ఇల్లు కట్టుకున్న సమయంలో అప్పట్లో ఇసుకను ఎవరో ఫ్రీగా ఇచ్చారని ఆదివారం ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. ఇసుక విధానంపై ఏదైనా మాట్లాడాలంటే అలా కుప్పల దగ్గరకు వెళ్లి నాణ్యతను పరీక్షించాల్సిన అవసరం లేదన్నారు. ఈవిషయాన్ని ఎవరైనా పవన్‌కళ్యాణ్‌కు చెప్పాలని సూచించారు. అలాగే ఇసుకను కిలోల ప్యాకేజీల్లో కూడా అమ్మబోరని చెప్పాల్సిందిగా కోరారు. పవన్‌కళ్యాణ్ ఇల్లు కట్టుకునేటప్పుడు ఇసుకను ఫ్రీగా అందించి ఉంటారని, కనుక ఇసుక రవాణా ఖర్చుల గురించి ఆయన అవగాహన ఉండి ఉండదని ట్విట్టర్‌లో పవన్‌కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.