ఆంధ్రప్రదేశ్‌

గోదావరి ప్రమాదం గల్లంతైన వారి ఆచూకీ కోసం నేవీ హెలికాఫ్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చలూరులో గోదావరి నదిలో మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్ఠ బోటులో గల్లంతైన పర్యాటకుల ఆచూకీ కోసం తూర్పునౌకాదళం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు తూర్పునౌకాదళం అధికారులు ఒక డార్నియర్ యుద్ధ విమానంతో పాటు రెండు హెలికాఫ్టర్లు ఆదివారం సాయంత్రం ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయలుదేరాయి. సహాయ కార్యక్రమాల కోసం జెమినీ బోట్లు, డైవింగ్ బృందాలతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో వీరు గాలింపు చేపడతారు. సోమవారం చీకటి పడిన నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి నేవీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు.
బోటుకు అనుమతుల్లేవు
గోదావరిలో ఆదివారం గల్లంతైన బోటుకు పర్యాటక శాఖ ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. రాయల్ వశిష్ఠ బోటును ప్రైవేటు వ్యక్తి కోడిగడ్ల వెంకటరమణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినక్టు వెల్లడించారు. విశాఖ నుంచి తూర్పునౌకాదళం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగుతున్నట్టు తెలిపారు.

*చిత్రం...- బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం బయలుదేరిన నేవీ డైవింగ్ బృందాలు