ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇష్టారాజ్యంగా పాలించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరు జిల్లా గురజాలలో పార్టీ ఆధ్వర్యాన జరిగే బహిరంగ సభ, ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరులోని తన నివాసం నుండి బయలుదేరిన కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి సమీపంలోని నందిగామ అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ వర్గీయులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు వెంటనే కన్నాతో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని సత్తెనపల్లిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు అతిథి గృహానికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో కన్నా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోందన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులపై పలుమార్లు పోలీసు అధికారులతో తాను చర్చించానన్నారు. రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై సాగిస్తున్న వేధింపులను అడ్డుకునేందుకు తాము శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా గురజాలలో ధర్నా, బహిరంగ సభ చేపడితే పోలీసులు భగ్నం చేయడం ఆక్షేపణీయమన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పౌరులకు ఉన్న స్వేచ్ఛను పోలీసులు హరించే చర్యలు చేపట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో దేవాలయ భూములను ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తే తాము సహించేది లేదన్నారు. దాతలు ఇచ్చిన భూములను ప్రభుత్వం సొంత ఆస్తుల మాదిరిగా పంపిణీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో భవన నిర్మాణ రంగం కుదేలయిందని, ఇసుక పాలసీ పేరిట అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఇసుక సక్రమంగా, సకాలంలో దొరకక నల్లబజారులో కొనాల్సిన పరిస్థితులు దాపురించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మరలా ఆందోళన చేపడతామని కన్నా స్పష్టంచేశారు.
మృతుల కుటుంబాలకు రూ.55 లక్షలు ఇవ్వాలి
ఇలా ఉండగా ఆదివారం గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో మృత్యువాత పడిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఒక్కో కుటుంబానికి 55 లక్షల రూపాయలను పరిహారం చెల్లించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
బోట్‌లు నడిపేందుకు చాలా నిబంధనలు ఉన్నాయని, అధికారుల బాధ్యతా రాహిత్యం వలనే తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బోట్‌ల రవాణా, నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా జల రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం బోటు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కన్నా రాజమండ్రి బయలుదేరి వెళ్లారు.
*చిత్రం...కన్నా కారును అడ్డుకుంటున్న పోలీసులు