ఆంధ్రప్రదేశ్‌

కోడెల ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు ఆత్యహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఎంతో గుండె ధైర్యం కలిగిన నేత ఆత్మహత్యకు పాల్పడడం ఏమిటని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కోడెల హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు గంటపాటు చికిత్స నిర్వహించినప్పటికీ తుదిశ్వాస విడిచారు. కాగా, గత కొన్ని రోజులుగా కోడెలపై పలు కేసులు చుట్టుముట్టడంతో రాజకీయ వేధింపులు తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కోడెల ఇకలేరన్న విషయం తెలసుకున్న ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య ఘటనలో అసలేం జరిగింది అనేది ఉత్కంఠగా మారింది. సోమవారం ఉదయం పది గంటల నుంచి ఆయన ఆత్మహత్యకు పాల్పడే ముందువరకు ఏంజరిగిందనే విషయంపై ఆయన వ్యక్తిగత సహాయకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడెల తన భార్యతో కలిసి ఉదయం పది గంటలకు టిఫిన్ చేశారు. అనంతరం 10:10 గంటలకు మొదటి అంతస్తులో ఉన్న తన బెడ్‌రూమ్‌కు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఆయన భార్య కూడా బెడ్‌రూమ్‌కు వెళ్లగా లాక్‌చేసి ఉంది. తలుపులు తీయాలంటూ ఆమె ఎంత అరచినా కోడెల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. దీంతో ఆమె గన్‌మెన్‌ను పిలిచి విషయం వివరించారు. గన్‌మెన్ వెనుక డోరు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా కోడెల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే కోడెల కుటుంబ సభ్యులు ఉదయం 10:40 నిమిషాల సమయంలో అతనిని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే కోడెల అపస్మారక స్థితిలో ఉన్నారని, వెంటనే బీపీ, పల్స్ చెక్ చేశామని, వైద్య బృందం చివరి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ జి. సుబ్రహ్మణేశ్వర రావు తెలిపారు. ప్రాణాలు కాపాడటం
కోసం గంటసేపు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, శ్వాస అందకనే కోడెల ప్రాణం పోయిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకుని కోడెల పార్థివదేహాన్ని సందర్శించి ప్రగాడ సంతాపం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన నలుగురు డాక్టర్ల బృందం కోడెల మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ప్రిమిలినరీ రిపోర్టులో ఉరివేసుకుని మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పరీక్షల అనంతరం పార్థివదేహాన్ని ఆయన స్వగృహానికి.. అనంతరం ప్రజల సందర్శనార్థం ఎన్టీఆర్ భవన్‌కు తరలించారు. మంగళవారం ఉదయానికి కోడెల మృతదేహాన్ని ఆయన స్వంత ప్రాంతం నరసరావుపేటకు తరలించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
ఆస్తి కోసం హత్య: కంచేటి సాయి
ఆస్తి కోసం కోడెల కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నాడని కోడెల మేనమామ కొడుకు, వరుసకు బావ అయిన కంచేటి సాయి సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. శివరాం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని కోడెల తనకు పలుమార్లు ఫోన్ చేసి చెప్పారని, ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం లేదని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేశారు.

*ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు (ఫైల్‌ఫొటో)