ఆంధ్రప్రదేశ్‌

ఆఖరి క్షణం వరకు పల్నాటి పులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కారణాలేమైనా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనే గుంటూరు జిల్లా నరసరావుపేటకు ఓ ప్రత్యేకత ఉంది. దీనికి కారణం తొలుత దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ఒకరైతే... దివంగత మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు మరొకరు. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన నెహ్రూ కుటుంబానికి చెందిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించి ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన బ్రహ్మానందరెడ్డి చరిత్ర పుటాల్లోకి ఎక్కారు. నాడు గత్యంతరం లేని స్థితిలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అది వేరే విషయం. ఇక అలాంటి కాసు కుటుంబాన్ని, అలాగే ఆ సామాజిక వర్గాన్ని కొనే్నళ్ల పాటు గడగడ వణికించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు పల్నాటి పులిగా ఉన్నతికెక్కారు. అలాంటి కోడెల తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితకాలంలో ఎనె్నన్నో అటుపోట్లు, ఒడిదడుగులు, విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొని చివరకి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర హోం
మంత్రిగా అధికారం చెలాయించి ఆ మంత్రిత్వ శాఖకే ఎంతో ప్రాచుర్యం తెచ్చారు. వాస్తవానికి ఆయన రాజకీయ జీవితం ఆరంభంలోనే కొన్ని గంటల పాటు అదీ ఓ ఎమ్మెల్యేగా లాకప్‌లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం తెరపైకి వస్తున్న అనేక కేసులతో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తోందనే ఆవేదన కూడా కోడెల మరణానికి ఓ కారణం కావచ్చు. వివరాల్లోకి వెళితే తొలిసారి 1983లో నర్సరావుపేట నుంచి టీడీపీ తరపున కోడెల గెలిచారు. వెన్నుపోటు రాజకీయాల్లో ఆయన నాదెండ్ల వెంట ఉన్నారనే ప్రచారంతో కోడెల ఇంటిపై రాళ్లదాడి జరిగింది. అయితే అలాంటిదేమీ లేదు తాను ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నానంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పోలీసు వారెంట్ పెండింగ్‌లో నున్న నర్సయ్య అనే వ్యక్తి పాల్గొనగా, నాడు అక్కడ ట్రైనీ ఏఎస్పీగా నున్న ఆర్పీ మీనా అతన్ని లాకప్‌లో వేయిస్తే కోడెల ఆవేశంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. చివరకు కోడెలను పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయం చిలకలూరిపేటలోనున్న ఎన్టీఆర్‌కు తెలిసి నర్సరావుపేటకు బయలుదేరారు. కలెక్టర్ జోక్యం చేసుకుని కోడెలను తక్షణం విడుదల చేయాలని ఆదేశిస్తే మీనా మాత్రం కుదరదు కేసు నమోదు చేసానన్నారు. దీంతో నాటి జాయింట్ కలెక్టర్ ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని సబ్ మెజిస్ట్రేట్ హోదాలో విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే కోడెల హోం మంత్రిగా అదే పోలీసు అధికారులతో సెల్యూట్ కొట్టించుకున్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి కమ్మ, రెడ్డి రాజకీయాలతో నర్సరావుపేట నలుగుతూ వచ్చింది. వాస్తవానికి బాంబుల సంస్కృతి టీడీపీ రాకముందు నుంచీ ఉంది. టీడీపీ వచ్చే వరకు కాసువర్గం ఏకచత్రాధిపత్యం వహించింది. కాసు బ్రహ్మానందరెడ్డి రెండు సార్లు ఫిరంగిపురం నుంచి ఒకసారి నర్సరావుపేట నుంచి శాసనసభకు ఎన్నికై ఏడున్నర సంవత్సరాలపాటు సీఎంగా పని చేశారు. ఆపై 1977, 80 ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా పని చేశారు. ఆ సమయంలో కీలకమైన హోం మంత్రిగా కూడా పని చేశారు. మధ్యలో కొద్దికాలం గవర్నర్‌గా పని చేశారు. బ్రహ్మానందరెడ్డి వారసునిగా సోదరుడు వెంగళరెడ్డి తనయుడు కృష్ణారెడ్డి నర్సరావుపేట నుంచి 1978, 2004, 2009లో ఎమ్మెల్యేగా 1989, 91 ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా పని చేస్తే కోడెల శాసనసభకు తొమ్మిది సార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలువగా మూడు సార్లు ఓటమిపాలయ్యారు. అది వీరి బహిర్గత రాజకీయ చరిత్ర. 1978 వరకు కాంగ్రెస్‌లో కాసు వర్గం అధిపత్యం కొనసాగితే... ఇందిరా కాంగ్రెస్ తరపున సీఎం కాగల్గిన భవనం వెంకట్రామ్ మరో వర్గాన్ని తయారు చేయడంతో ‘రెడ్డి’ వర్గం బీటలు వారింది. నాటి సీఎం టీ అంజయ్య హయంలో 1981లో దశాబ్దాలకాలం తర్వాత పంచాయతీ సమితి ఎన్నికలు జరిగాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోపూరి బ్రహ్మానందం కమ్యూనిస్టు, స్వతంత్ర పార్టీల మద్దతుతో బరిలోగి దిగగా అదే వర్గానికి చెందిన చేకూరి లక్ష్మీకాంతరావు మద్దతునిచ్చారు. అయితే రెడ్డి కాంగ్రెస్ తరపున లింగంగుంట్లకు చెందిన కామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఇందిరా కాంగ్రెస్ తరపున చేజెర్లకు చెందిన బూచిపూది సుబ్బారెడ్డి పోటీ చేయటంతో బ్రహ్మానందం గెలుపు సునాయాసం అయింది. తదుపరి రాజకీయ పరిణామాల మధ్య నర్సరావుపేట ‘రాజాగారి కోట’ పత్రికల్లో ఎక్కింది. డాక్టర్ కోడెల, డాక్టర్ మర్రి పెద్దయ్య, డాక్టర్ మోపర్తి వెంకటేశ్వర్లు ముగ్గురు కల్సి ఆ కోటలోనే శాశ్వత స్థావరాలు ఏర్పరుచుకుని కమ్మ వర్గాన్ని ఏకీకృతం చేశారు. టీడీపీ ఆవిర్భాంతో ఆ పార్టీలో చేరిన కోడెలకు 1983 తొలి ఎన్నికల్లో నరసరావుపేట సీటు వచ్చింది. ఇదే సమయంలో రెడ్డి వర్గాలన్నీ ఏకమై కాసు కృష్ణారెడ్డిని గురజాల పంపించి సుబ్బారెడ్డిని నర్సరావుపేటలో బరిలోకి దించారు. తక్షణం కమ్మ సామాజికవర్గం టీడీపీ అభ్యర్థిని డాక్టర్ అనిశెట్టి పద్మావతిని తప్పించి ఆఖరి క్షణంలో కోడెలను బరిలోకి దించారు. తీరా ఆ ఎన్నికల్లో రెడ్డి అభ్యర్థులిరువురూ ఓటమి పాలయ్యారు. బాంబుల సంస్కృతి 1981 సమితి ఎన్నికల నుంచే ఆరంభమై కాలక్రమంలో మరింత విస్తరించింది. పంచాయతీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ఎన్నిక అంటే చాలు ఊరూవాడ బాంబులు పేలేవి. ఆరోపణలు ప్రత్యారోపణలు ఆపై కేసులతో వందలాది మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి ఆ పై కోర్టుల చుట్టూ తిరిగేవారు. విచారణ కాలంలోనే ఎందరో హత్యలకు, ఆత్మహత్యలకు, సాధారణ మరణాలకు గురయ్యారు. 1999లో జరిగిన జమిలి ఎన్నికలు ఈ బాంబుల సంస్కృతికి పరాకాష్ట. కానీ ఆ తరువాత ఈ సంస్కృతి తగ్గుతూ వచ్చింది. ఆ ఎన్నికల్లో శాసనసభకు కోడెల, కాసు పోటీ చేస్తే లోక్‌సభకు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, లాల్‌జాన్ బాషా పోటీ చేశారు. ఎన్నికలకు 24 గంటలు ముందుగా కోడెల నివాస గృహం కోటలో బాంబులు పేలితే ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి పూదోట సతీష్‌తోపాటు ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. నెల రోజులపాటు కర్ఫ్యూ సాగింది. ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ బాంబు పేళుళ్లు జాతీయ స్థాయిలో కోడెలకు అప్రతిష్టను చేకూర్చాయి. ఇదే సందర్భంలో భారత ఎన్నికల సంఘం కూడా ఇండిపెండెంట్ మరణిస్తే ఇక ఎన్నికలు వాయిదా వేయరాదనే నిర్ణయానికి కూడా వచ్చింది. కోడెల తొలిసారిగా హోం మంత్రిగా ఆ శాఖకు గుర్తింపు తెస్తున్న నేపథ్యంలో జరిగిన వంగవీటి మోహనరంగా హత్య కేసులో విమర్శలకు గురై ఆ శాఖకే కాదు మంత్రి పదవికే దూరం కావాల్సి వచ్చింది.
*చిత్రం... డాక్టర్ కోడెల శివప్రసాదరావు