ఆంధ్రప్రదేశ్‌

ఏపీ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. సాధారణ పరిపాలనా విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్‌పీ సిసోడియాను ఆదే హోదాలో గిరిజన సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌ను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. సాధారణ పరిపాలనా విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్)గా అదనపు బాధ్యతలను అప్పగించింది. పార్వతీపురం ఐటీడీఏ పీవో వీ. వినోద్ కుమార్‌ను విజయవాడ సబ్ కలెక్టర్‌గా, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎండి ఇలియాస్ రిజ్విని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఏపీ ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రతీప్ కుమార్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అదనపు బాధ్యతలను అప్పగించింది.