ఆంధ్రప్రదేశ్‌

అచ్నెన్నాయుడుకి అరెస్ట్ వారెంట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: ఇటీవల చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా ఉండవల్లి కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పాటు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై నమోదైన కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడుకు అరెస్టు వారెంట్ జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు ఆయనపై ఇప్పటికే టెక్కలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఏ క్షణాన్నయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీస్ వర్గాల సమాచారం. అచ్చెన్నాయుడుపై రాజధాని ప్రాంతంలో కేసు నమోదైనట్లు టీడీపీ నేతలు ధృవీకరించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం సన్నాహాలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తనపై నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చే సోమవారానికి వాయిదా పడినట్లు తెలిసింది.