ఆంధ్రప్రదేశ్‌

చివరి చూపు కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/విజయవాడ, సెప్టెంబర్ 17: శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పార్థివదేహం మంగళవారం రాత్రి గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు వెంటరాగా, వేలాది కార్యకర్తల నడుమ మంగళవారం కృష్ణా జిల్లా గరికపాడు వద్ద కోడెల హైదరాబాద్ నుండి భౌతిక కాయం తరలిస్తున్న వాహనశ్రేణి ఆంధ్రప్రదేశ్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రవేశించింది. జోరున వర్షం పడుతున్నప్పటికీ వేలాది మంది కార్యకర్తలు కోడెల పార్థివదేహం ఉన్న అంబులెన్సును అడుగడుగునా ఆపి తమ నేతను చివరిచూపు చూసుకునేందుకు పోటీపడ్డారు. గరికపాడు వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వేలాది మంది కార్యకర్తలు ఎదురేగి భౌతికకాయానికి శోకతప్త హృదయాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ కోడెల నినాదాలు మార్మోగాయి. గరికపాడు నుండి జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ వరకు
అంతిమయాత్ర చేరుకుంది. అప్పటికే కెన్యా నుండి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుండి రోడ్డుమార్గాన ఇబ్రహీంపట్నం చేరుకున్న కోడెల తనయుడు శివరామ్ తన తండ్రి పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గొల్లపూడి నుండి భవానీపురం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర చంద్రబాబు కాలి నడకన మిగిలిన నాయకులతో పాటు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అలాగే కృష్ణాజిల్లాలో పార్టీ ముఖ్య నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమా, గద్దె రామ్మోహనరావు, బుద్ధా వెంకన్న, కేశినేని నాని కోడెలకు ఘన నివాళులర్పించారు. విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని మీదుగా గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి దాదాపు ఏడు గంటల ప్రయాణం అనంతరం రాత్రి సుమారు 7.30 గంటలకు చేరుకుంది. కార్యకర్తల సందర్శన కోసం భౌతికకాయాన్ని వాహనం నుండి కార్యాలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చి ఎతె్తైన వేదికపై ఉంచారు. అప్పటికే కొన్ని గంటల నుండి కోడెల భౌతికకాయం కోసం శ్రేణులు ఎదురుచూస్తున్నారు. భారీ వర్షాన్ని లేక్కచేయక బాపట్ల, రేపల్లె, విజయవాడ పరిసర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దాదాపు రెండు గంటల పాటు సందర్శకుల తాకిడితో తొక్కిసలాట జరిగింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. జోహార్ కోడెల నినాదాలతో గుంటూరు మార్మోగింది. పలువురు అభిమానులు, నేతలు కంటతడి పెట్టి శోకతప్త హృదయాలతో నివాళులర్పించారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ కార్యాలయం నుండి తిరిగి అంతిమయాత్ర నర్సరావుపేటకు పేరేచర్ల, ఫిరంగిపురం మీదుగా కొనసాగింది. నివాళులర్పించిన వారిలో టీడీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు కిమిడి కళావెంకట్రావ్, వర్ల రామయ్య, పరిటాల సునీతతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నాయకులు, కోడెల అభిమానులు, బంధువులు, దేశం కార్యకర్తలు ఉన్నారు. కోడెల పార్థివదేహానికి బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. నర్సరావుపేటలోని పార్టీ కార్యాలయం నుండి ఆయన స్వగ్రామమైన నకరికల్లు మండలంలోని కండ్లకుంటకు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తారు.

*చిత్రం... కోడెల భౌతికకాయం తరలింపు యాత్రలో పాల్గొన్న చంద్రబాబు, ఎంపీ కేశినేని, ఇతర నాయకులు