ఆంధ్రప్రదేశ్‌

పేదరికం నిర్మూలనకు 150 పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 17: దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 150కు పైగా పథకాలను అమలు చేస్తూ వారి జీవితాలో వెలుగులు నింపుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 69వ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జన్మదిన కేక్‌ను కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజుతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అలాగే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులకు పండ్లు, పోషకపదార్థాలు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహ పేరిట కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు నిర్వహించారన్నారు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మాట్లాడుతూ గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం అసాధారణ విజయాలను నమోదు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, సోషల్ మీడియా కన్వీనర్ కన్నా నాగరాజు, పార్టీ నాయకులు జూపూడి రంగరాజు, చందు సాంబశివరావు, నల్లబోతు వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ, కృష్ణంరాజు తదితరులు