ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్‌లో డీఎస్సీ నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ 2018 టీచర్ పోస్టుల నియామకాలను వచ్చే నెలలో చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. బుధవారం చిత్తూరులో జరిగిన విద్యాశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2018 డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అనివార్య కారణాల వల్ల కొంత జాప్యం జరిగిందని, వచ్చేనెలలో ఈ నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి అరసరమైన టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం పాఠశాల పర్యవేక్షణ నియంత్రణ చట్టాన్ని తీసుకురానున్నామని, ఇందుకు సంబంధించి విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ సారి బడ్జెట్‌లో 33వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలకు కనీస వౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా పాఠశాల విద్యాకమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లో మద్యనిషేధం , పర్యావరణ పరిరక్షణ అంశాలను చేర్చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. నేడు అమ్మ ఒడి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య
గణనీయంగా పెరిగిందన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండాలని ఇందుకు కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ వంటశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని , ఈ వంట శాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి పాఠశాలకు సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి చోటు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని , ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి సురేష్ వివరించారు. విద్యాశాఖలో సుమారు ఐదు వేల మంది కాంట్రాక్టు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వీరిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఉపాధ్యాయులు బదిలీ ప్రక్రియ ఉండదని మంత్రి తేల్చి చెప్పారు. ప్రస్తుతం బదిలీను చేపడితే అనేక సమస్యల వచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఈ ఏడాది వాటికి స్వస్తి చెప్పాలని నిర్ణయించామన్నారు. విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా అవార్డులను ఇకపై భిన్నంగా ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు.
*చిత్రం... రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్