ఆంధ్రప్రదేశ్‌

వేధింపుల వల్లే కోడెల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ప్రతినిధి బృందం గురువారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అకాల మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వేధింపులకు సంబంధించి ఈ సందర్భంగా పలు ఆధారాలతో లేఖ అందించారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసుల గురించి కూడా వివరించారు. గవర్నర్‌ను కల్సిన వారిలో చంద్రబాబుతోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, ఎమ్మెల్యేలు కే అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చిన రాజప్ప, కరణం బలరాం, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్‌రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, పీ అశోక్‌బాబు, యలమంచిలి రాజేంద్రప్రసాద్, మాజీమంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, సీనియర్ నేతలు నన్నపనేని రాజకుమారి, వర్ల రామయ్య, తదితరులు ఉన్నారు.

*చిత్రం...గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు