ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో రాక్షస పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో గత 100 రోజులుగా సాగుతున్న రాక్షస పాలనను గతంలో ముందెన్నడూ చూడలేదని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి దారి తీసిన కారణాలపై గురువారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత నగరంలోని ఒక హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోడెల మరణం, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు క్షుణ్ణంగా వివరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే డీజీపీ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉన్నారని అన్నారు. ఇక అధికార పక్ష మీడియా తప్పుడు కథనాలతో విష ప్రచారానికి దిగిందన్నారు. నిజం నిప్పులాంటిదన్నారు. కోడెలను శారీరకంగా, మానసికంగా ఎంతగానో వేధించారన్నారు.
అన్నింటికీ మించి సోషల్ మీడియా ద్వారా కోడెలను రెచ్చగొట్టారన్నారు. బెయిలల్ సెక్షన్‌లు అయినా కూడా కేసులు పెట్టి కోడెల అనుయాయులను అరెస్ట్ చేయటం మొదలు పెట్టారని అన్నారు. మరో వైపు మీడియాను లొంగదీసుకోవటం, లేదా వాటి ప్రసారాలను నిషేధించడం కొత్తగా మొదలు పెట్టారని అన్నారు. కోడెలపై 18 తప్పుడు కేసులు పెట్టారంటూ చంద్రబాబు ఆగ్రహించారు. ఉదాహరణగా నాగరాజు అనే వ్యక్తి రంజీ క్రికెట్‌లో కోడెల శివరాం డబ్బులు వసూలు చేసారని ఒక కేసు, ఫర్నిచర్ తీసుకు వెళ్లాలంటూ కోడెల స్వయంగా ప్రభుత్వానికి మూడు సార్లు లేఖలు రాసినప్పుడు విస్మరించి ఐపీసీ 409 సెక్షన్ కింద తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. అసలు లక్ష రూపాయల ఫర్నిచర్ కోసం భయంకర కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. 72 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిపై ఇలా ఎవరైనా వ్యవహరిస్తారా అన్నారు.
సీఎం ఇంట్లో ఉండే దొంగ ప్రాపర్టీపై కూడా కేసులు పెట్టాలి కదా అన్నారు. దీనికి ప్రతి సారి ట్విట్టర్‌లో పోస్టు చేసే క్రిమినల్ విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అనవసరంగా వేధించడం తప్పని, చట్ట ప్రకారమే వ్యవహరించాలని తాను గతంలో ఎన్నోసార్లు చెప్పానన్నారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు చేసిన ట్విట్టర్ పోస్టులను చదివి వినిపించారు. అసలు ఫర్నిచర్ కేసే న్యూసెన్స్.. పెట్టీ కేస్.. తప్పుడు కేసుపెట్టి అవమానించి కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారన్నారు. ఈ కేసులపై తగు న్యాయం కోసం త్వరలో సుప్రీంకోర్టుకు వెళతామని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నేరస్థుల పాలన సాగుతున్నదన్నారు. మరోవైపు 70 మంది అసాంఘిక శక్తులను జైలు నుంచి వెలుపలకు తెచ్చారన్నారు. ఇవన్నీ కూడా గవర్నర్‌కు వివరించామని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసు విషయంలో ఎలా వ్యవహరించారు.. కోడెల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కోఢెల మరణంపై సీబీఐ విచారణ కోరుతున్నామన్నారు. మానవ హక్కుల కమిషన్‌ను కలుస్తామన్నారు. నీతి కోసం.. సమాజం కోసం రాజకీయాలు చేస్తాం కాని వీరి లాగా అక్రమ రాజకీయాలు చేయబోమన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న చంద్రబాబు