ఆంధ్రప్రదేశ్‌

11,158 గ్రామ సచివాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్రంలో 11,158 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, పురపాలక శాఖ కమిషనర్ విజయ్‌కుమార్, కార్యదర్శి శ్యామలరావుతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు రోజుల వ్యవధిలో పరీక్షలు నిర్వహించి, తక్కువ కాలంలోనే ఫలితాలు వెల్లడించడం రికార్డు అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 2 నుంచి సచివాలయాలు పని చేయడం ప్రారంభిస్తాయన్నారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం 32 రకాల సేవలతో ప్రారంభిస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ అనుకున్న విధంగానే 20లోపు ఫలితాలు వెల్లడించామన్నారు.
ఫలితాలను గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, ఆర్టీజీఎస్, ఏపీపోలీస్ వెబ్‌సైట్‌ల్లో తెలుసుకోవచ్చన్నారు.

*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, అధికారులు