ఆంధ్రప్రదేశ్‌

చత్తీస్‌గఢ్ నుంచి విశాఖ వరకు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు పోర్టులతో అనుసంధానం చేసేందుకు కేంద్రం గ్రీన్ ఫీల్డ్ కారిడార్ రోడ్డు నిర్మాణాలు చేపట్టనుందని ఆర్‌అండ్‌బి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ నుంచి విశాఖపట్నం వరకు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ రోడ్డు నిర్మాణం చేపట్టిందని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ రోడ్డు నిర్మాణంలో విజయనగరం జిల్లాకు సంబంధించి 70 కిమీ రహదారి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారితో సంబంధం లేకుండా పూర్తిగా నూతన రహదారిని తక్కువ దూరంలో నిర్మిస్తారన్నారు.
తెలంగాణాలోని ఖమ్మం జిల్లా నుంచి రాజమండ్రిని అనుసంధానం చేసేలా ఒక రోడ్డును నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో 2,300 కిమీ మెటల్, గ్రావెల్ రోడ్లను బీటీ రోడ్లగా మారుస్తామన్నారు. గతంలో ఆర్‌అండ్‌బి ద్వారా మంజూరై ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిచిపోయిన రూ.10 కోట్ల లోపు రోడ్డు పనులను మళ్లీ కొనసాగించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి గిరిజన ఉప ప్రణాళిక నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు.
గిరిజన ప్రాంతా ఏజెన్సీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు గిరిజన సంక్షేమ కమిషనర్‌కు పంపించాలన్నారు. ఆయన ఆధ్వర్యంలోని కమిటీ ఈ రోడ్ల ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. విజయనగరం జిల్లాలో ఉన్న పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు, బైపాస్ రోడ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా బల్క్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక స్టాక్ యార్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్‌ను ఆదేశించారు.