ఆంధ్రప్రదేశ్‌

అనంతలో పేలిన నాటు బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 27: అనంతపురం నగరంలోని తపోవనంలో శనివారం నాటు బాంబు పేలింది. దీంతో చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు ఏరుకునే ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన కమలమ్మ చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు ఏరుకుని విక్రయించి పొట్టపోసుకుంటోంది. శనివారం ఉదయం 9.00 గంటల ప్రాంతంలో తపోవనం రెండవ క్రాస్‌లోని ఓ ఇంటి పక్కన ఉన్న చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్ల కోసం వెతుకుతుండగా పెద్ద శబ్దంతో నాటు బాంబు పేలింది. పేలుడు తీవ్రతకు ఆమె ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దంతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. ఉరుకులు పరుగులపై పేలుడు సంభవించిన చోటుకు చేరుకుని పరిశీలించగా అక్కడ ఓ మహిళ తీవ్ర గాయాలతో కనిపించింది. అక్కడ రక్తం మరకలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన కమలమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. నాటు బాంబు పేలుడుతో తపోవనం వాసులు ఉలిక్కిపడ్డారు. నాటుబాంబు అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని ఎవరు అక్కడ పడేశారు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

చిత్రం.. నాటుబాంబు పేలుడులో గాయపడిన మహిళ