ఆంధ్రప్రదేశ్‌

రహదారుల రాజసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: బ్రిక్స్ దేశాల్లో ప్రారంభించిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) నిధులతో రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనుంది. రాష్టవ్య్రాప్తంగా రూ.6,400 కోట్లతో 3వేల కిమీ రహదారులను విస్తరించనున్నట్టు రహదార్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రహదారులను రెండు వరుసల రహదారులగా విస్తరించే కార్యక్రమాన్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు. దీనిలో భాగంగా ఇరుకుగాను, శిథిలావస్థలో ఉన్న వంతెనలు కూడా విస్తరించనున్నట్టు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా శిథిలావస్థలో ఉన్న 278 వంతెనల పునర్నిర్మాణాన్ని రూ.1500 కోట్లతో చేపట్టనున్నామని, దీనికి సంబందించిన సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదార్ల అనుసంధానతకు సంబంధించి రూ.329 కోట్లతో 39 పనులు చేపట్టినట్టు తెలిపారు. వీటిలో 28 పనులు ప్రగతిలో
ఉన్నాయని, ఇప్పటి వరకూ రూ.230 కోట్లు వ్యయం చేసినట్టు తెలిపారు. రూ.50 కోట్ల విలువైన మరో 11 పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు. ఉత్తరాంధ్ర సహా తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో గతంలో రూ.263 కోట్లతో మంజూరైన 28 పనుల్లో 12 పనులు పూర్తికగా మరో 8 పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగానే రహదార్లను రెండు వరుసలుగా విస్తరించడంతో పాటు వంతెనలు పటిష్టపరిచే కార్యక్రమం చేపట్టామన్నారు. కేంద్రం ప్రభుత్వ సహకారంతో సీలేరు-్భద్రాచలం, అరకు-రాజమండ్రి రహదారులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.
ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను రద్దు చేయలేదని, టెండర్లను పరిశీలించి అంచనాలు సక్రమమేనని నిర్ధారించుకుని తిరిగి ప్రారంభిస్తామన్నారు. రూ.10 కోట్లకు మించని పనులు 25 శాతం కంటే తక్కువ జరిగినా ప్రారంభించుకునేందుకు సీఎం అనుమతులు మంజూరు చేశారన్నారు. మిగిలిన వాటిపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. అటవీ అనుమతులు ఆలస్యం కారణంగా నిలిచిపోయిన పనులు ప్రారంభించేందుకు కమిటీ సమీక్షిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.