ఆంధ్రప్రదేశ్‌

రివర్స్‌తో లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 58 కోట్ల రూపాయల మేర ఆదా అయింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రివర్స్ టెండరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు 65 ప్యాకేజీలో భాగంగా 919 మీటర్ల ఇరిగేషన్ సొరంగం, లెఫ్ట్ ఫ్లాంక్ హెడ్ రెగ్యులేటర్, నేవిగేషన్ లాక్, అప్రోచ్ చానళ్లు, నేవిగేషన్ చానళ్ల తవ్వకం పనులను ప్రతిపాదించారు. గత ప్రభుత్వ హయాంలో 65 ప్యాకేజీ పనుల అంచనా విలువ 274.25 కోట్ల రూపాయలు కాగా, మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ 290.09 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. తాజాగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో అదే సంస్థ 231.47 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకుంది. ఈ నెల రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ఆరు కంపెనీలు పోటీ పడ్డాయి. గతంలో ఆ పనులకు ఇదే కంపెనీ అంచనాల కంటే 4.8 శాతం ఎక్కువగా పనులు దక్కించుకుంది. ఇప్పుడు అదే సంస్థ 15.6 శాతం తక్కువకు ఆ పనులు చేసేందుకు ముందుకు రావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు ఫైనాన్సియల్ బిడ్స్‌ను ఈ నెల 23న తెరువనున్నారు. ప్రాజెక్టు హెడ్ వర్క్సు, స్పిల్ వే, స్పిల్ వే చానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌కు సంబంధించి ఫైనాన్సియల్ బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధాన డ్యామ్ పనులకు 1771 కోట్ల రూపాయలను అంచనా విలువగా ప్రభుత్వం పేర్కొంది. 65 ప్యాకేజీ పనుల్లో రివర్సు టెండరింగ్ వల్ల 58 కోట్ల రూపాయలు ఆదా అవడం శుభపరిణామంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందనడానికి, భారీగా అంచనాలు పెంచారనడానికి ఇదే నిదర్శమని తెలిపారు.