ఆంధ్రప్రదేశ్‌

పొలిటికల్ మైలేజీ కోసమే దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 20: గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఛీత్కారంతో ప్రతిపక్షానికి పరిమితమైన తెలుగుదేశం పార్టీ తిరిగి ప్రజల సానుభూతి పొందేందుకు అందివచ్చిన ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఈ కోవలోనే కోడెల ఆత్మహత్య అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు బృందం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడుతూ కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూ ఆయన మరణాన్ని వైసీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికీ కోడెల మృతిపై చంద్రబాబుకు ఎటువంటి బాధా లేదని, ఆయన ముఖంలో ఎక్కడా ఆ భావం కన్పించడం లేదన్నారు. నర్సరావుపేటలో కోడెల అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు తీరు చూస్తే ఎన్నికల ప్రచార ఊరేగింపులో పాల్గొనట్లు ఉందని విమర్శించారు. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారని, దీనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఉన్న కేసుల గురించి పేర్కొనడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా నమోదు చేయాల్సిన ధర్మం పోలీసులపై ఉంటుందని, అలా వచ్చిన ఫిర్యాదులతోనే గతంలో తనపైనా, ఇటీవల కోడెలపైనా నమోదయ్యాయని తెలిపారు. ఒక సీనియర్ నేత మరణించినప్పుడు ఆయనలోని మంచి గుణాలను చర్చిస్తామని, కానీ చంద్రబాబు పుణ్యమా అని కోడెలలోని చెడు కోణాన్ని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని అంబటి పేర్కొన్నారు.