ఆంధ్రప్రదేశ్‌

ప్రమాదానికి ముందు తీసిన ఫొటోలు, ఫోను బయటపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటులోని ప్రయాణికులకు దేవీపట్నం పోలీసులు తీసిన ఫొటోలు, ఆ ఫోన్‌ను బయటపెట్టాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోలీసులంటే తమకు నమ్మకం, గౌరవమని, బోటును తనిఖీలు చేయడంతో భరోసాతో తాము బయలుదేరామని ఒక బాధితురాలు మీడియా ముందు చెప్పిందంటే, పోలీసులంటే ప్రజల్లోవున్న నమ్మకాన్ని ఎస్పీ గుర్తించాలన్నారు. బోటును వెళ్లకుండా నిలుపుచేసిన దేవీపట్నం ఎస్సైకి పైనుండి ఒత్తిడి రానిపక్షంలో ఆయనను సస్పెండ్ చేయాలి కదా అని హర్షకుమార్ ప్రశ్నించారు. తాను మూడు రోజుల నిద్రనుంచి లేచినట్టు మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. తాను దేవీపట్నం వెళ్లానని, ఇక్కడొచ్చి బాధితులను పరామర్శించానని, గతంలో కూడా మంటూరు వద్ద కూడా సాయం అందించానని గుర్తిచేశారు. బోటు తీయాలని ప్రభుత్వానికి లేదని, తాను విమర్శించిన తర్వాత కమిటీ వేశారని, పుష్కరాలకు ఇంత మంది చనిపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించిన వారు ఇప్పుడు ఇంతమంది చనిపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. హెలీకాప్టర్‌లో చూసేసి, అమరావతిలో కూర్చోవడం సరికాదన్నారు.