ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మొత్తం 70 గేట్లను మూడు అడుగుల మేర పైకి ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కులను సముద్రంలోకి మిగిలిన 10వేల క్యూసెక్కులను కాలువలకు వదలుతున్నారు.
వర్షాల కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీరు వెలుపలకు వెళ్లే పరిస్థితి కల్పించడం లేదు. దీనివల్ల కాలువలకు నీటి సరఫరాను గణనీయంగా తగ్గించారు. కృష్ణా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున రైతులెవరూ కాలువలపై ఆధారపడటం లేదు. పైగా కాలువల పక్కన వున్న భూముల రైతాంగం మాత్రం ఏ క్షణాన కాలువకట్టలు తెగుతాయోనని ఆందోళన చెందుతూ నీటి సంఘాల ద్వారా కాలువలకు నీటి సరఫరాను తగ్గింప చేస్తున్నారు.
ఇదిలావుండగా వరద ఉధృతి క్రమేణ పెరుగుతుండటంతో కృష్ణా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు.