ఆంధ్రప్రదేశ్‌

గత ప్రభుత్వ ఐటీ పాలసీల అమలుపై కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో ఐటి, ఐటి ఆధారిత పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు గత ప్రభుత్వం రూపొందించిన నాలుగు పాలసీల అమలులో తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ (సీసీఐటీఐ)ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఐటి, ఐటి ఆధారిత పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా నాలుగు విధానాలను గత ప్రభుత్వం రూపొందించింది. ఏపీ ఐటి పాలసీ, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ, ఏపీ డీటీపీ పాలసీలను తయారు చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వివిధ కంపెనీలకు రాయితీలు, భూ కేటాయింపులు వంటివి ఈ పాలసీల ద్వారా వర్తింప చేసేది. అయితే ఈ పాలసీలను అమలు చేసే విధానంపై వైకాపా ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. రాయితీలు, భూ కేటాయింపుల్లో ఒక పద్ధతి పాటించకుండా కేటాయించారని విమర్శలు చేసింది. భూ కేటాయింపుల్లో అవతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా చేసింది. దీంతో ఈ పాలసీలను పునఃసమీక్షించి, కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నాలుగు పాలసీల అమలును పర్యవేక్షించేందుకు వీలుగా ఒక కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్‌గా ఐటి,ఇ అండ్ సి విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్యులుగా ఐటి విభాగం స్పెషల్ సెక్రటరీ, ఏపీట్రాన్స్‌కో సీఎండీ, విద్యుత్ పంపిణీ సంస్థల ఎండీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్, ఏపీఐఐసీ ఎండీ, కార్మిక శాఖ, పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ, విఎస్‌ఈజెడ్, ఎస్టీపీఐల ప్రతినిధులు, ప్రభుత్వ ఐటి సలహాదారు సభ్యులుగా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా ఐటీ ప్రమోషన్స్ జాయింట్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. ఈ నాలుగు పాలసీలకు సంబంధించి ప్రోత్సాహకాల మంజూరుకు సీసీఐటీఐ సింగిల్ విండోగా పని చేస్తుంది. రాయితీలు, భూ కేటాయింపులను ఈ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ పాలసీల ద్వారా అనుకున్న లక్ష్యాల సాధనలో ఎదురయ్యే సమస్యలను కూడా ఈ కమిటీ పరిష్కరిస్తుంది. ప్రోత్సహకాల మంజూరు పూర్తిగా ఈ కమిటీ విచక్షణాధికారం కల్పించారు.