ఆంధ్రప్రదేశ్‌

చిరస్మరణీయుడు శివప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 21: సినీ నటుడిగానే కాకుండా రాజకీయ రంగంలో, ప్రజా సంక్షేమంలో రాజీలేని నేతగా ఎదిగిన చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగా నిలిచే ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు తెలుగుదేశం పార్టీకి విధేయుడుగా ఉంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషిచేశారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటు వేదికగా పోరాడిన తీరు మర్చిపోలేనిదన్నారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
కళా వెంకట్రావు దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడం తనను ఎంతగానో బాధించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన 2009, 2014లో చిల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే నేతగా సుపరిచితులయ్యారన్నారు. తిరుపతిలో డాక్టర్‌గా సేవలందించిన శివప్రసాద్ నటనపై మక్కువతో సినీరంగంలోకి ప్రవేశించి ప్రజలను మెప్పించారని అంటూ సంతాపం వ్యక్తంచేశారు.
ప్రజల హృదయాల్లో చెరగని స్థానం: నక్కా ఆనందబాబు
రాష్ట్రంలో సమైక్యాంధ్ర అనంతరం ప్రత్యేక హోదా ఉద్యమాల్లో మాజీ ఎంపీ నారుమల్లి శివప్రసాద్ చూపిన పోరాట పటిమ, నిరసనలు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కొనియాడారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంస్మరణలో పాల్గొని శివప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆనందబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా చూపిన తెగువ, పోరాటం భావితరం నాయకులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, పార్టీ నాయకులు దారపనేని నరేంద్ర, మనె్నం శివనాగమల్లేశ్వరరావు, కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రాలు.. లోక్‌సభ సమావేశాల కాలంలో టీడీపీ మాజీ ఎంపీ దివంగత శివప్రసాద్ తనదైన నాటకీయ ఫక్కీలో ప్రతిఒక్కర్నీ అలరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఏరోజుకారోజు కొత్త భంగిమలో దర్శనమిచ్చి, జాతీయ స్థాయిలో అందర్నీ ఆకట్టుకున్నారు.
ఇటు పురాణ పురుషులు మొదలుకుని సాధారణ వేషాల వరకు ఆయన కనిపించిన దృశ్యాలివి..