ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి తారకమంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పరిశ్రమలు, వ్యవసాయంతో పాటు ఇతర కీలక రంగాలకు అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శరవేగంగా అభివృద్ధి చెందాలంటే అందుబాటు ధరల్లో విద్యుత్‌ను సరఫరా చేయటం ఒక్కటే మార్గమన్నారు. డిమాండ్‌కు తగిన సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీఈఈ ఆధ్వర్యంలో ఈ నెల 23,24 తేదీల్లో ఢిల్లీలో ఎంఎస్‌ఎంఈలలో ఇంధన సామర్థ్యంపై జాతీయ సదస్సుకు ఆహ్వానం అందిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మంత్రి బాలినేనికి ఆదివారం తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)లో ఇంధన సామర్థ్యానికి సంబంధించిన టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. ఎంఎస్‌ఎంఈలలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు ద్వారా నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని, పరిశ్రమల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, కర్బన ఉద్గారాలు కూడా తగ్గిపోతాయని శ్రీకాంత్ వివరించారు.
పరిశ్రమల అభివృద్ధిలో ఇంధన శాఖదే కీలక పాత్ర అని, తక్కువ ధరకే సరఫరా చేయటంలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీపడుతోందని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. అన్నివర్గాల వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటం ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాడుకలో లేని, తక్కువ ఇంధన సామర్థ్య సాంకేతికతపై ఆధారపడటం ద్వారా ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించినట్లు బీఈఈ డీజీ అభయ్ భాక్రే తెలిపారని శ్రీకాంత్ మంత్రికి తెలిపారు. ఎంఎస్‌ఎంఈలలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లాలో భారీగా ఉద్యోగావకాశాలు కల్పించే ఈ రంగంలో అధునాతన టెక్నాలజీతో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయాలని బీఈఈ నిర్ణయించిందని చెప్పారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఇత్తడి, సిరామిక్స్, డెయిరీ, ఫౌండ్రీ వంటి 12 క్లస్టర్ల ఎంఎస్‌ఎంఈలలో ఇంధన సామర్థ్య టెక్నాలజీలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు భాక్రే చెప్పారన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ఏపీ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు బాగా లబ్ధి పొందుతాయని భాక్రే పేర్కొన్నారని చెప్పారు. వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేది ఎంఎస్‌ఎంఈ రంగమే అన్నారు. విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించే ఎంఎస్‌ఎంఈలలో ఇంధన సామర్థ్యానికి
సంబంధించిన సాంకేతిక సాయాన్ని అందిస్తామని బీఈఈ డీజీ ప్రకటించారు. ఈఎస్పీవో ద్వారా ఇంధన సామర్థ్య టెక్నాలజీని మెరుగుపరచుకునే విధానాలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి పరిశ్రమల అభివృద్ధి సంస్థ (యూఎన్‌ఐడీఒ) ద్వారా అంతర్జాతీయ పర్యావరణ సంస్థల మద్దతు కూడా తీసుకుంటామన్నారు. విద్యుత్ వినియోగం ఆధారంగా ఎంఎస్‌ఎంఈలను వర్గీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈసీబీసీ కమర్షియల్ అమలులో ఉందని, దానికితోడు ఇటీవలే ఈసీబీసీని గృహాల్లో అమలు చేసేందుకు సంసిద్ధమయ్యారన్నారు. ఇందుకు సంబంధించిన జాతీయ వర్క్‌షాప్ ఆగస్ట్ 29, 30 తేదీల్లో విజయవాడలో నిర్వహించారని శ్రీకాంత్ గుర్తుచేశారు. గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ ఫెసిలిటీ (జీఎల్‌ఎఫ్)లో భాగంగా ఎంఎస్‌ఎంఈలలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు బీఈఈ ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. లక్షిత ఎంఎస్‌ఎంఈలలో ఇంధన సామర్థ్య పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీఈఈ డీజీ తెలిపారు. టీఈఆర్‌ఐ సాయంతో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ఇటీవల ఫిషరీస్ రంగానికి సంబంధించి భీమవరంలో, రీఫ్రాక్టరీ క్లస్టర్‌కు సంబంధించి తూర్పుగోదావరిలో, ఫౌండ్రీ క్లస్టర్లపై విజయవాడలో అధ్యయనం చేశామని శ్రీకాంత్ తెలిపారు. రెండు ఫిషరీస్ యూనిట్లలో ఏడాదికి 1.49 మిలియన్ యూనిట్లు, రీఫ్రాక్టరీ యూనిట్లలో 0.25 మిలియన్ యూనిట్లు, ఫౌండ్రీ యూనిట్లలో 0.65 యూనిట్లు విద్యుత్ పొదుపుచేసే అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ అధ్యయనానికి బీఈఈ ఆర్థిక సాయం అందించిందని చెప్పారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి ఎస్‌ఈసీఎం డిస్కంల చొరవతో పరిశ్రమల రంగం మద్దతు, ప్రోత్సాహంతో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు చురుకుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు, డిస్కంల సీఎండీలు నాగలక్ష్మీ సెల్వరాజన్, హర్‌నాథరావులకు ఇంధన శాఖ కార్యదర్శి పలు సూచనలు చేశారు. ఎంఎస్‌ఎంఈ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సంక్షోభంలో ఉన్న పరిశ్రమలకు ప్రత్యేక సాయం అందించడం, కొత్తవాటిని ఏర్పాటు చేయటానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బీఈఈ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏపీలోని వేలాది చిన్న తరహా పరిశ్రమలకు ఉపకరిస్తాయని తెలిపారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు వల్ల డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతుందని శ్రీకాంత్ వివరించారు.