ఆంధ్రప్రదేశ్‌

ప్రమాదాల నివారణకు జాతీయ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 22: గోదావరి నదిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం చాలా దురదృష్టకరమని, బోటు ప్రమాదాల నివారణకు జాతీయ స్థాయిలో ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి చెప్పారు. రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అవసరమైతే చట్టాలు మార్చి నూతన పాలసీ తీసుకు వచ్చి కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విపత్తుల్లో సహాయ పడేందుకు ఒక ప్రత్యేక హెలీకాప్టర్‌ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. కచ్చులూరు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ కొత్త విధానం రావాల్సి ఉందన్నారు. బోట్ల ప్రయాణానికి సంబంధించి ఏదో ఒక శాఖకు బాధ్యతలు చేపట్టే విధంగా తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం
జరిగిందని, దీనితో పాటు అన్ని రాష్ట్రాల్లోని నదుల్లో పర్యాటకానికి సంబంధించి పర్యాటకుల భద్రత, రక్షణ చర్యల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా కొత్త పాలసీని రావాలన్నారు. కొత్త పాలసీలో లైసెన్స్ లేకుండా బోట్లు నడిపినా, లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణించినా కఠిన శిక్షలు ఉండే విధంగా పాలసీ ఉండాలన్నారు. లైసెన్స్ లేని బోటు నడిపితే ఆ బోటును సీజ్ చేస్తామన్నారు. తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరగడం వల్ల చట్టాల్లో మార్పులు తప్పవన్నారు. ఇటువంటి సమయాల్లో కేంద్రం నుంచి ఎటువంటి సహాయం కావాలని కోరినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రైవేటు బోట్ల ప్రయాణంపై ఎప్పటికపుడు నిఘా ఉంచాలన్నారు. ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక కూడా ఇవ్వాలని కోరుతున్నామని, దానిపై కూడా చర్చిస్తామన్నారు. ఒక హెలీకాప్టర్‌ను విశాఖపట్నం నుంచి ఇటువంటి విపత్తులకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతీ వారికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ బోట్‌లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బోట్‌ను వెలికితీసే విషయంలో నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. గోదావరి నదిలో వరద నీరు పెరిగిందన్నారు. కేంద్ర మంత్రి విపత్తులకు సంబంధించి విశాఖలో హెలీకాప్టర్ సిద్ధం చేస్తామన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద స్థలం సిద్ధం చేసి ఇక్కడ ఆ సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రికి సూచించారు. సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏలూరు డిఐజీ ఏకే ఖాన్, ఏపీ ఎస్పీ ఐజీ శ్రీనివాస్, జిల్ల ఎస్పీ అద్నాన్ నరుూమ్ అస్మి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయి, సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి