ఆంధ్రప్రదేశ్‌

బలహీన వర్గాలకు ఉద్యోగాలొస్తే తట్టుకోలేని బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 22: వైసీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ క్రమంలో గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించి లక్షా 25వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. వీరిలో బలహీన వర్గాలకు చెందిన వారికి ఉద్యోగాలు లభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పారదర్శకంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, అవినీతి జరిగిందంటూ చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా ఏపీపీఎస్సీ ద్వారా లక్ష ఉద్యోగాలకు పైగా భర్తీ చేసిన దాఖలాలు ఉన్నాయా?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే లక్షా 27వేల ఉద్యోగాలు భర్తీ చేశారంటే విలువలు, విశ్వసనీయతోనే అది సాధ్యపడిందన్నారు. చంద్రబాబు పరిపాలన అంతా కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్, ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేయడంతోనే సరిపోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు, ఆయన మీడియా ఎన్ని కుట్రలు పన్నినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్ జగన్ ఉంటే ఉంటారని జోగి రమేష్ స్పష్టం చేశారు.
అభూత కల్పనలతో అపోహలు: జంగా
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుతుంటే అభూత కల్పనలతో అపోహలు సృష్టించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని వైసీసీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. ప్రజలకు మేలు చేసేందుకు జగన్ గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారని, నిరుద్యోగులకు భరోసా కల్పించే ఈ నిర్ణయాన్ని టీడీపీ నాయకులు సానుకూలంగా తీసుకోలేక పోతున్నారన్నారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జంగా మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో మొదటి ర్యాంక్ వస్తే చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పెద్దలు తట్టుకోలేక పోతున్నారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జోగి రమేష్