ఆంధ్రప్రదేశ్‌

రెడ్‌క్రాస్ సేవల్లో శ్రీధర్‌రెడ్డికి రాష్టప్రతి బంగారు పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: అత్యంత నిబద్ధతతో కూడిన మానవీయ సేవలు అందించినందుకుగాను డా.శ్రీధర్ రెడ్డిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అత్యున్నత సేవా పురస్కారం ‘రాష్టప్రతి బంగారు పతకం’ వరించింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న డా.శ్రీధర్ రెడ్డికి ఈ నెల 30న ఢిల్లీలోని ‘రాష్టప్రతి భవన్’లో జరుగనున్న రెడ్‌క్రాస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ బంగారు పతకాన్ని అందజేయనున్నారు. 15ఏళ్లుగా డా.ఎ.శ్రీధర్ రెడ్డి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖలో వివిధ హోదాలలో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. 2009లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి కేవలం 6 గంటల్లో 8 వేలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించడం, 2009 కృష్ణానది వరదల సమయంలో 14వేల కుటుంబాలకు బట్టలు, ఆహారం, వంట సామగ్రి అందించడం, 2014 ‘హుద్ హుద్’ తుపాను సమయంలో మలేసియా తెలుగు అసోసియేషన్ సహకారంతో వరద ప్రభావిత ఉత్తరాంధ్ర జిల్లాలకు వరద సహాయం అందించడం వంటి కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు అందించడం, అగ్నిప్రమాద బాధితులకు రెడ్‌క్రాస్ ద్వారా తక్షణ సహాయం, జిల్లాలోని వివిధ కళాశాలలు, పారిశ్రామిక సంస్థల్లో ‘ప్రథమచికిత్స’ శిక్షణ నిర్వహించడం, కెనడియన్ రెడ్‌క్రాస్ సహకారంతో జిల్లాలోని ముంపు గ్రామాలను దత్తత తీసుకుని ‘నివారణ’ చర్యలు చేపట్టడం వంటి క్రియాశీలక కార్యక్రమాల ద్వారా డా.శ్రీధర్ రెడ్డి మానవీయ సేవలు ఇలాంటి అత్యున్నత బంగారు పతకాలకు ప్రతి ఏటా దేశావ్యప్తంగా ఇద్దరిని ఎంపిక చేయనుండగా వారిలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఒకరు. ఆయన ఇప్పటివరకు రాష్ట్ర గవర్నర్ ద్వారా 9 బంగారు పతకాలు, 2010 ఎన్టీఆర్ ట్రస్టు అవార్డు, 10 సార్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవా అవార్డులు జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా అందుకున్నారు. మరెన్నో ప్రశంసా పత్రాలు, సత్కారాలు తన మానవీయ సేవల ద్వారా సాధించారు. ‘రెడ్‌క్రాస్‌లో అత్యున్నత పురస్కారం’ రాష్టప్రతి బంగారు పతకం లభించడం తనకు చాలా ఆనందంగా ఉందని, మరింత సేవా నిరతి కలిగిస్తోందని డా.శ్రీధర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో రెడ్‌క్రాస్ ద్వారా మరిన్ని విస్తృతమైన సేవలు అందిస్తానని ఆయన తెలిపారు.