ఆంధ్రప్రదేశ్‌

కాపు ముద్ర పడనివ్వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 28: జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సెప్టెంబరు 9న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించే బహిరంగ సభకు కాపుల సభగా ముద్ర పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. కాకినాడలో తాను నిర్వహించే సభను గిట్టనివారు కాపుల సభగా అభివర్ణించే అవకాశాలుండటంతో ఇటువంటి యత్నాలను తిప్పికొట్టాలని ముఖ్యనేతలు, అభిమానులకు పవన్ సంకేతాలు పంపినట్టు సమాచారం. తిరుపతిలో పవన్‌కల్యాణ్ నిర్వహించిన బహిరంగ సభకు కాపులే సారథ్యం వహించినట్టు రాష్టవ్య్రాప్తంగా ప్రచారం జరిగింది. పవన్ ఈ అంశాన్ని అనుయాయుల వద్ద తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. అలాగే తిరుపతి సభలో తనకు ఫలానా కులం, మతం, ప్రాంతాలతో సంబంధాల్లేవని, తాను అందరివాడినని పవన్ స్పష్టంచేశారు. ఇప్పుడు ఇదే విషయమై ముఖ్య నేతలతో పవన్ చర్చించినట్టు సమాచారం. కాకినాడ సభకు పవన్ అభిమానులే హాజరయ్యారనే సంకేతాలు రావాలి తప్పితే, అక్కడ కూడా కాపులే ముందుండి నడిపించినట్టు ఎట్టిపరిస్థితుల్లో ప్రచారం జరగకూడదని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన తన సన్నిహితులకు పవన్ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.