ఆంధ్రప్రదేశ్‌

నోరు జారొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాకు ఉద్యమించి, లక్ష్యాన్ని సాధిస్తానంటే ఎంపీలంతా పవన్ వెంటనే నడుస్తామని అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, తామంతా ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నామన్నారు. పార్లమెంటులో కూడా పోడియం వద్దకు వెళ్లి రోజుల తరబడి నినాదాలు చేశామని, అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్లకార్డులుపట్టుకున్నామన్నారు. ఇంతకంటే పార్లమెంటరీ వ్యవస్ధలో ఏమి చేయగలమన్నారు. పవన్‌కు పార్లమెంటరీ వ్యవస్ధ అంటే తెలుసా అని ఆయన ప్రశ్నించారు. వ్యాపారాలు చేసేవారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోరుపారేసుకోవడం పవన్ స్ధాయికి తగదన్నారు. తమ కుటుంబం తాము పుట్టకముందు నుంచే వ్యాపారాలు చేస్తోందన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా గురించి అన్ని విషయాలు తెలుసని, రాష్ట్రప్రయోజనాల కోసం అన్ని విషయాలను భరిస్తున్నారన్నారు. ‘ ఎంపి పదవి నాకు వెంట్రుకతో సమానం. ప్రత్యేక హోదా వస్తుందంటే రాజీనామా చేసి ఉద్యమిస్తాం ’ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ పార్లమెంటులో హోదాకోసం నినదించామన్నారు. మేమంతా రాజీనామా చేసిన మోదీ సర్కార్‌కు ఎటువంటి నష్టం లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం తాను చేసే ఉద్యమం, ప్రణాళికపై స్పష్టత ఇవ్వాలన్నారు. హోదా తీసుకువస్తే తాను పవన్ అనుచరుడుగా మారిపోతానన్నారు. రాజకీయాలు అంటే సినిమా కాదని, నిజ జీవితమన్నారు. హిందీ భాష తమకు రాకపోవచ్చని, కాని ఇంగ్లీషు వస్తుందన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విభజన బిల్లు సమయంలో పార్లమెంటులోప్రత్యేక హోదాపై డిమాండ్ చేశారన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసం వెంకయ్యనాయుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. గతంలో విభజన సమయంలోనే కేంద్ర మంత్రులు రాజీనామా చేయలేదని, వారంతా రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మెగాస్టార్ చిరంజీవి చివరి వరకు కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగారని ఆయన అన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని, లేదంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే ఆంధ్రాలో బిజెపికి పడుతుందని స్పష్టంగా చెప్పామన్నారు. ఎన్నికలకు ముందు ఎన్టీఏ కూటమికి ఇన్ని సీట్లు వస్తాయారావో అని మోదీ అనుకున్నారని, పూర్తి మెజార్టీ వచ్చే సరికి పట్టించుకోవడం మానివేశారన్నారు. పవన్‌కు వయస్సు, అనుభవం తక్కువని, హోదా కోసం ఏమి చేయబోతున్నారో రోడ్ మ్యాప్ ఇవ్వాలన్నారు. భారతదేశానికి అన్యాయం చేసింది మహాత్మాగాంధీ, నెహ్రూ అన్నారు. ప్రాణ నష్టం జరుగుతుందనే భయంతోనే దేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్‌కు అంగీకారం తెలిపారన్నారు. విడదీసిన తర్వాత రెండు దేశాలు శాంతితో ఉంటాయని భావించారని, కాని ఈ రోజు రక్షణ వ్యవస్ధకు ఇరు దేశాలు లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నాయన్నారు. అలాగే తమ స్వార్ధరాజకీయాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్, బిజెపి విడదీశాయన్నారు. పవన్ కల్యాణ్ హోదాకోసం నిరంతరం పోరాడుతున్న తమపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.