రాష్ట్రీయం

పిలిస్తే...వెళ్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ మరో అవకాశం ఇచ్చి పిలిస్తే హాజరవుతానని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన ఏపి శాసనసభలో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ శాసనసభ తీర్మానం మేరకు ఏడాదిపాటు సస్పెన్షన్ విధించిన విషయం విదితమే. హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విషయంలో ఇచ్చిన తీర్పు ఉపశమనం కలిగించినా, ధర్మాసనం మాత్రం ఈ సస్పెన్షన్ విషయమై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రోజాకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యేందుకు మరో అవకాశం ఇస్తామని ప్రకటించారు.
శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కెరోజా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు ప్రివిలేజ్ కమిటీ నుంచి పిలుపు వస్తే హాజరవుతానని, కాని తాను సారీ చెప్పినా సస్పెన్షన్‌ను తొలగిస్తారన్న నమ్మకం లేదన్నారు. తనకు న్యాయం జరగదని తెలిసినా హాజరవుతానన్నారు. తనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు గతంలో ఇస్తే, హైకోర్టు, సుప్రీంకోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున వెళ్లలేకపోయానన్నారు.
కాల్‌మనీ సెక్స్ రాకెట్ విషయంలో బాధితులను పరిరక్షించేందుకు గట్టిగా మాట్లాడుతున్నాననే అక్కసుతో రాష్ట్రప్రభుత్వం తనపై నిందలు మోపిందన్నారు. తాను ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైనప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఫుటేజి అడుగుతానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై దాడి చేసేందుకు టిడిపి మహిళా ఎమ్మెల్యేలను పావుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కాల్‌మనీ అంశంపై చర్చిద్దామని నోటీసు ఇచ్చినందుకు తనను లక్ష్యం చేసుకున్నారన్నారు. కా.మ సిఎం అనడం తప్పుకాదన్నారు. ఒక మీడియా సంస్ధ కాల్‌మనీని ‘కామ’ అని పేర్కొందన్నారు. సస్పెన్షన్‌పై న్యాయ స్ధానంలో తన పోరాటం సాగుతుందన్నారు. తనకు టిడిపి ఎమ్మెల్యే అనిత అంటే కోపం లేదని, ఆమెను టిడిపి రాజకీయాలకు బలి చేస్తున్నారన్నారు.