ఆంధ్రప్రదేశ్‌

అందరి చూపూ అమరావతి వైపే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత విద్యకు చిరునామాగా మారనుంది. అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలు, అత్యాధునిక పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ప్రఖ్యాత విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయిలో పేరున్న సంస్థలకు విలువైన భూముల పందారంతో పాటు ఉదారంగా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కోట్లాది రూపాయల విలువైన భూములను గజం కేవలం వెయ్యి రూపాయలకే అప్పనంగా అప్పగిస్తున్న నేపథ్యంలో చెన్నై కేంద్రంగా వివిధ విద్యాసంస్థలను నడుపుతున్న ఎస్‌ఆర్‌ఎం సంస్థకు కూడా 200 ఎకరాలు కేటాయించిన కొద్దిరోజుల్లోనే ఆ సంస్థ పనితీరు ఏమిటో ఆ సంస్థ ఛైర్మన్ పచముత్తు అరెస్ట్‌తో తాజాగా బట్టబయలైంది. ఈనేపథ్యంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా, లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది. దేశ విదేశాలకు చెందిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను, పరిశోధనా సంస్థలను నెలకొల్పడానికి ముందుకొచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ దేశ విదేశీ విద్యాసంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది. మరీముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఐయుఐహెచ్ (ఇండో-యుకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) ఆధ్వర్యంలో అమరావతిలో భారీ ప్రాజెక్టు తలపెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలతో ఆరోగ్య విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వెయ్యి పడకల మెగా ఆసుపత్రి నిర్మిస్తారు. వీటికి అనుబంధంగా పరిశోధన, శిక్షణ సంస్థలను నెలకొల్పుతారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న సంకల్పంతో ఐయుఐహెచ్ ఉంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఏడు జాతీయ స్థాయి విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు రావలసి ఉంది. ఇప్పటికే ఐదు జాతీయ సంస్థలు తాత్కాలిక భవనాల్లో ప్రారంభమయ్యాయి. వాటికి నిధులు కూడా మంజూరయ్యాయి. వ్యవసాయ పరిశోధనలకు ఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో 1924లో ఏర్పాటైన లాం పరిశోధనా స్థానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 910 ఎకరాలను సిద్ధం చేసింది. ఈ విశ్వవిద్యాలయానికి కేంద్రం రూ.200 కోట్లు కేటాయించింది. రూ.85 కోట్లు విడుదల చేసింది. దేశంలో ఆరోదైన ఐఐఎస్‌ఇఆర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్)ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. దీన్ని నెలకొల్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మేర్లపాకలో 590 ఎకరాలు కేటాయించింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీలో ఐఐఐటి నెలకొల్పారు.
కేంద్ర, ప్రైవేటు విద్యాసంస్థలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతుగా కొన్ని విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో టూరిజం, హాస్పిటాలిటీ, ఆక్వా, స్కిల్ డెవలప్‌మెంట్, వాటర్, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనుంది. రాయలసీమలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. కొత్త సాంకేతిక విప్లవానికి స్వాగతం పలుకుతూ ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)లో విద్యార్థులకు శిక్షణ, సహకరించేందుకు జపాన్‌కు చెందిన కీ (కెఐఐ) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.