ఆంధ్రప్రదేశ్‌

పంట సాగుకు నాణ్యమైన విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 29: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పంటలు ఎండిపోకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించనున్నామని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. వాస్తవానికి వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడ భూగర్భ జలాలు కూడా అడుగంటాయన్నారు. విద్యుత్ రంగానికి సంబంధించిన అన్ని లైన్ల ప్రధాన ఫీడర్లను, అలాగే రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఐదున్నర లక్షల వీధిదీపాల పర్యవేక్షణ ఇక నుంచి బెజవాడ దుర్గాఘాట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే ముఖ్యమంత్రి కూడా స్వయంగా సమీక్షించనున్నారని తెలిపారు. ఇప్పటికి 4లక్షల, 20వేల వీధిదీపాలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, సెప్టెంబర్ 15 నాటికి అన్ని లైట్లు ఈ కేంద్రంతో అనుసంధానం అవుతాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉండగా ప్రస్తుతం విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించిందన్నారు. రాబోయే రోజుల్లో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతోపాటు మైక్రో లెవల్‌లో పనితీరు ఎలా మెరుగుపరచుకోవాలో సీఎం ఆదేశాల మేరకు ఈ కంట్రోల్ కేంద్రం నుంచే సమస్తం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా గడచిన రెండేళ్లలో విద్యుత్ రంగం పనితీరు ఏవిధంగా ఉందో తెలుసుకోడానికి అజయ్ జైన్ సిఎండి విజయానంద్‌తో కలిసి సోమవారం నాడిక్కడ రాష్టస్థ్రాయి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత 27 మాసాలుగా విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు కసరత్తు చేపట్టారు. ఈసందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ దేశంలో తక్కువ విద్యుత్ నష్టాల్లో చూస్తే ఏపిలో 10.2 శాతంగా ఉందని, దీన్ని ఇంకా సింగిల్ డిజిట్‌కి తీసుకురావటానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న 15లక్షల పంపుసెట్లకు జియో ట్యాగింగ్ అమర్చటానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు అమర్చనున్నట్లు తెలిపారు. ముందుగా అర్బన్ ఏరియాల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో విద్యుత్ డిమాండ్ 162 మిలియన్ యూనిట్లు ఉండేదని, ఇప్పుడది 178 మిలియన్ యూనిట్లకు చేరిందని తెలిపారు. గతంకంటే కూడా 20శాతం డిమాండ్ పెరిగిందని తెలిపారు. అయినా విద్యుత్ సరఫరాలో లోపాలు రాకుండా వినియోగదారులకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సెక్టార్‌లో ఏపి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్‌మోడల్‌గా ఉందని తెలిపారు. ఇంకా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కజాలా యాప్‌ను ఉపయోగించి ఉద్యోగుల సేవలను సమర్ధంగా వినియోగించుకోవటం కోసం కృషి చేస్తామన్నారు. ఏపిఎస్ పిడిసిఎల్ సిఎండి ఎంఎం నాయక్, ఎనర్జీ అడ్వైజర్ రంగనాథం, ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరచూరి, తదితర రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్