ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీల వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 29: అంగన్‌వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతూ కొత్త సచివాలయంలో తొలి ఫైలుపై స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సంతకం చేశారు. వెలగపూడి సచివాలయం నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులో సోమవారం ఉదయం 8.03 గంటలకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రి సుజాత , 9.09 గంటలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచడం ద్వారా ప్రభుత్వంపై అదనంగా రూ.26కోట్ల భారం పడుతుందని తెలిపారు.
విభిన్న ప్రతిభావంతులైన వారిని గుర్తించేందుకు అవార్డుల కమిటీ నియామకపు ఫైలుపై రెండో సంతకం చేశారు. సచివాలయాన్ని అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. మైనింగ్ శాఖ ద్వారా లక్ష్యాలకు మించి ఈ ఏడాది రూ.15వందల కోట్లు వసూలు చేశామని వివరించారు.
ప్రత్యేక హోదాపై స్పందిస్తూ ఈ అంశంలో సమష్టిగా పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రికి మద్దతుగా పార్టీ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో ఎంసెట్:మంత్రి గంటా
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌తో పాటు అన్ని పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామని చెప్పారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి రాజధాని అమరావతిలో 200 ఎకరాల భూమిని కేటాయించామని యాజమాన్యం వివాదాల్లో చిక్కుకున్నందున ముఖ్యమంత్రిని సంప్రతించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి కేసులు లేవనేది పవన్ గ్రహించాలని ఆయన హితవు పలికారు.

చిత్రం.. సచివాలయంలో ఫైళ్లపై సంతకాలు చేస్తున్న మంత్రి సుజాత