ఆంధ్రప్రదేశ్‌

అథఃపాతాళానికి భూగర్భ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 29 : రాయలసీమలో ప్రస్తుత ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు దయనీయస్థితికి చేరుకోవడంతో నాలుగు జిల్లాల్లో 24 గంటల పాటు వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా భూగర్భ జలాలు అట్టడుగున ఉండటంతో నీటిని మోటార్లతో తోడటం ఇబ్బందికరంగా ఉంటుందని వాపోతున్నారు. మరోవైపు ప్రధాన కాలువలైన కెసి, ఎస్‌ఆర్‌బిసి, హంద్రీ-నీవాలో నీటి పారుదల లేకపోవడంతో విద్యుత్ ఉన్నా నీటిని ఎక్కడి నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా పంటలను కాపాడుకునేందుకు భూగర్భజలాలను తోడి రెయిన్‌గన్ల ద్వారా పంటలపై పిచికారి చేయాలన్నది సిఎం అభిప్రాయం. ఆయన ఆదేశాల మేరకు సోమవారం నుంచి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రారంభించామని అధికారులు స్పష్టం చేశారు.
సీమలోని 4 జిల్లాల్లో భూగర్భజలాలు అట్టడుగున ఉండటంతో 60 శాతం మేర బోర్లు రెండు గంటలు పని చేస్తే మరో నాలుగైదు గంటల పాటు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. రాయలసీమ వ్యాప్తంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయానికి అధికారులు పంపిన నివేదిక ప్రకారం 4 జిల్లాల్లో సగటున 14.49 మీటర్ల దిగువన భూగర్భజలాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. చిత్తూరు జిల్లాలో 12.63, కడపలో 15.11. అనంతపురంలో 19.27, కర్నూలులో 10.95 మీటర్ల దిగువన జలాలు ఉన్నాయి. గత జూన్, జూలై మాసాల్లో కురిసిన భారీవర్షాల కారణంగా భూగర్భ జలాల వృద్ధి గణనీయంగా కనిపించిందని వారంటున్నారు. మే నెలలో రాయలసీమలో సగటున 15.1 మీటర్ల దిగువన ఉన్న జలాలు జూలై నాటికి 13.32 మీటర్ల స్థాయిలో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. ఆ తరువాత వరుణుడు ముఖం చాటేయడం, పంటకుంటల్లో నీరు ఇంకిపోవడం, వాతావరణంలో వేడి, గాలుల ప్రభావంతో భూగర్భ జలాలు మళ్లీ దిగువకు చేరుకుంటున్నాయని వారంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పంట సంజీవని పథకం కింద తవ్విన పంట కుంటల కారణంగా భూగర్భజలాల్లో వృద్ధి స్పష్టంగా కనిపించిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాయలసీమలో సగటున 23.3 మీటర్ల దిగువకు పడిపోయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించి 14.49 మీటర్ల స్థాయిలో జలాలు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. దీని కారణం జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలు కురవడం, తవ్విన పంట కుంటల్లో నీరు సమృద్ధిగా చేరడంతో పాటు కర్నూలు జిల్లాలోని కెసి కాలువ, ఎస్‌ఆర్‌బిసి దిగువ కాలువల్లో నీటి సరఫరా, అలగనూరు, వెలుగోడు జలాశయాల్లో నీరు చేరిందన్నారు. ఈ నెలలో కూడా సాధారణ స్థితిలో వర్షం కురిసి ఉంటే భూగర్భ జలాలు సాధారణ స్థితిలో ఉండేవని వారంటున్నారు. ఇలా వరుసగా మూడేళ్లు నీరు భూగర్భంలోకి ఇంకితే ఆ తరువాత ఓ మోస్తరు వర్షాలు కురిసినా భూగర్భజలాలు నిల్వ ఉంటాయని అపుడు రెయిన్‌గన్లు మంచి ఫలితాలు ఇస్తాయంటున్నారు.